Breaking News

పాకిస్తాన్ వధువు, భారత వరుడు.. మరో జంట కథ

Published on Sun, 08/06/2023 - 12:44

జోధ్‌పూర్: భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధం మరింత బలపడింది. ఇప్పటికే సీమా హైదర్-సచిన్ మీనా, అంజు-నస్రుల్లా భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి తమ ప్రేమను గెలిపించుకోగా తాజాగా అమీనా-అర్బాజ్ ఖాన్ కూడా ఒక్కటై ఈ లిస్టులో చేరిపోయారు. అయితే వీరు సాహసాలకు తెరతీయకుండా పెద్దలను ఒప్పించి ఆన్‌లైన్‌లో వివాహం చేసుకున్నారు.  

పాకిస్థాన్‌కు చెందిన అమీనాకు భారత్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అర్బాజ్ ఖాన్‌కు వర్చువల్‌గా వివాహం జరిగింది. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన సంబంధమని పాకిస్థాన్‌లో ఉన్న తమ బంధువులు ఈ సంబంధాన్ని మాట్లాడి కుదిర్చినట్లు చెప్పారు అర్బాజ్ ఖాన్. వాస్తవానికి వివాహం భారత్‌లోనే జరగాలి కానీ అమీనాకు వీసా దొరకకపోవడం వలన ఎవరి దేశాల్లో వారు ఉండిపోయామని. అయినప్పటికీ తమ నిఖా సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలోనే జరిగినట్లు అర్బాజ్ ఖాన్ తెలిపాడు. 

భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేనందునే ఈ విధంగా ఆన్‌లైన్‌లో వివాహం చేసుకోవాల్సి వచ్చిందని అమీనాకు  వీసా వచ్చిన తర్వాత ఇండియాలో మళ్ళీ వివాహం చేసుకుంటానని చెప్పారు అర్బాజ్. నిఖా మాత్రమే కాదు వివాహానికి సంబంధించిన అన్ని సంప్రదాయాలను దగ్గరుండి జరిపించారు కుటుంబ సభ్యులు. అర్బాజ్ చెప్పినట్లు పాకిస్తాన్ భారతదేశం మధ్య సంబంధాలు సరిగ్గా లేవన్నది ఒకప్పటి మాట. ఈ జంటల కథలను చూస్తే సంబంధాలు మెరుగవుతున్నట్టే కనిపిస్తోంది.   

ఇది కూడా చదవండి: హర్యానా అల్లర్లు: నాలుగోరోజుకు చేరిన బుల్డోజర్‌ విధ్వంస ప్రక్రియ 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు