Breaking News

పాక్‌ నడ్డి విరిగేలా..

Published on Tue, 04/29/2025 - 13:46

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో రేపు కేబినెట్‌ సమావేశం జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యం కారణంగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత సమావేశంలో భద్రతా క్యాబినెట్ కమిటీ(CCS) పాకిస్తాన్ పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. వారం వ్యవధిలోనే సీసీఎస్‌ భేటీ జరుగుతుండడం గమనార్హం.

సింధు జలాల ఒప్పందాన్ని  నిలిపివేత , దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాకిస్తాన్ జాతీయుల వీసా రద్దు తదితర  నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో.. సరిహద్దుల్లో భద్రతా బలగల సన్నద్ధత, ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న ఆపరేషన్, పాకిస్తాన్‌పై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవడంపై కేబినెట్‌ చర్చించనుంది. ఆ వెంటనే ఆర్థిక భద్రతా కమిటీ జరుగుతుండడంతో పాక్‌ నడ్డి విరిగేలా ఈ నిర్ణయాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. పహల్గాం దాడి జరిగిన మరుసటిరోజు ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా కేబినెట్‌ కమిటీ (CCS) సమావేశమైంది. ఈ ఉన్నత స్థాయి భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, విదేశాంగ మంత్రి జై శంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ హాజరయ్యారు. కేబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్‌, రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌, విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ సహా ప్రధానమంత్రి ఇద్దరు ప్రిన్సిపల్‌ కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంతదాస్‌లు పాల్గొన్నారు. ఈ కమిటీలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఉన్నప్పటికీ.. అమెరికా పర్యటనలో ఉన్నందున హాజరుకాలేకపోయారు. 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)