Breaking News

యువతుల మిస్సింగ్‌ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌

Published on Fri, 02/06/2026 - 13:17

ఆపరేషన్‌ మిలాప్‌.. కనిపించకుండా పోయిన వాళ్లను గుర్తించి వాళ్ల ఇళ్లకు చేర్చేందుకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన స్పెషల్‌ ఆపరేషన్‌. కిందటి ఏడాది ఈ ఆపరేషన్‌ ద్వారా 1,303 మంది జాడను గుర్తించగలిగారు. అందులో చిన్నపిల్లలు, అమ్మాయిల ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు కేవలం 15 రోజుల్లోనే వందల మంది ఆచూకీ లేకుండా పోయింది. వాళ్లను ట్రేస్‌ చేయడంలో పోలీసులు ఘోరంగా ఫెయిల్‌ అయ్యారు. ఇలా అనుకుంటున్నలోపే పోలీసులు పెద్ద ట్విస్టే ఇచ్చారు.

దేశ రాజధాని రీజియన్‌లో మిస్సింగ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని.. అందులో అమ్మాయిల సంఖ్యే అధికంగా ఉంటోందన్న కథనాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వాటి ఆధారంగా ఇటు మీడియా సంస్థలూ వరుస కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో.. ఢిల్లీ పోలీసులు ఈ వార్తలను ఖండించారు. దీని వెనుక పెయిడ్‌ ప్రమోషన్‌ ముఠా ఉందని తేల్చేశారు.

జనవరి 1 నుంచి 15వ తేదీల మధ్య ఏకంగా 800 కనిపించకుండా పోయారన్నది ఆ ప్రచార సారాంశం. వీటి ఆధారంగా కొన్ని ఇండిపెండెంట్‌ మీడియా సంస్థలు.. వాటి ఆధారంగా ప్రధాన వార్తా సంస్థలూ కథనాలు ప్రచురించాయి. అందులో.. ఢిల్లీలో మొత్తం 807 మంది కనిపించకుండా పోయారు. వీళ్లలో 509 మంది మహిళలు, అమ్మాయిలు.. 298 మంది పురుషులు ఉన్నారు. మొత్తంలో 191 మంది మైనర్లు, 616 మంది పెద్దలు ఉన్నారని తెలిపాయి. జనవరి 1 నుండి 27 వరకు 235 మందిని పోలీసులు గుర్తించగా, 572 మంది ఇంకా కనిపించలేదని.. రోజుకు సగటున 27 మంది మిస్సింగ్‌గా రిపోర్ట్‌ అవుతుండగా, 9 మందిని మాత్రమే పోలీసులు కనిపెడుతున్నారని మీడియా డాటా తెలిపింది. ఈ డాటా ఆధారంగా ప్రతిపక్ష ఆప్‌.. అధికార బీజేపీపై విరుచుకుపడింది.

అయితే.. ఈ కథనాలతో ఆశ్చర్యపోయిన ఢిల్లీ పోలీసులు విచారణను లోతుగా దర్యాప్తు చేశారు. అందులో.. మిస్సింగ్‌ గర్ల్స్‌ సంఖ్య పెరిగిందన్న ప్రచారం స్పాన్సర్డ్‌ పోస్టుల ద్వారా వైరల్‌ అయ్యిందని గుర్తించారు. డబ్బు కోసం భయాన్ని సృష్టించడం సహించబోమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ పోలీసులు ఎక్స్‌ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. ఇలాంటి వదంతులను నమ్మొద్దని.. నిర్ధారణ లేని సోషల్‌ మీడియా పోస్టులను పట్టించుకోవద్దని.. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ వాసులకు చెబుతున్నారు.

గత సంవత్సరం గణాంకాలతో పోలిస్తే మిస్సింగ్‌ కేసులు పెరగలేదు. ఈ జనవరిలో కేసులు తగ్గాయి అని జాయింట్‌ కమిషనర్‌ సంజయ్‌ త్యాగి తెలిపారు. కాబట్టి నెట్టింట జరిగే ప్రచారం కేవలం వదంతులు మాత్రమేనని ఆయన అన్నారు.

గత సంవత్సరం ఢిల్లీ పోలీసులు “ఆపరేషన్‌ మిలాప్” కింద మొత్తం 1,303 మంది కనిపించకుండా పోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాలతో మళ్లీ కలిపారు. వీరిలో 434 మంది పిల్లలు, 869 మంది పెద్దలు ఉన్నారు. ఒక్క డిసెంబర్‌లోనే 102 మంది ఆచూకీకి గుర్తించగలిగారు. 

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు