Breaking News

రూ.800కి సేల్స్‌మేన్‌ ‌: క్లీనర్‌కి లంబోర్ఘిని ఇచ్చి, హైదరాబాదీ గొప్ప మనసు

Published on Thu, 10/22/2026 - 15:42

జిమ్‌లో పనిచేసే ఒక వ్యక్తి, కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ లంబోర్ఘిని (Lamborghini) కారును ఎంతో ఆసక్తిగా గమనిస్తుండటాన్ని గమనించిన కారు యజమాని స్పందించిన తీరు నెట్టింట విశేషంగా నిలుస్తోంది.  హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త కురపాటి నాగ వెంకట రాకేష్ కుమార్ తీసుకున్న ఒక ఆసక్తికర నిర్ణయం  నెటిజనులను ఆలోచింప చేస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను స్వయంగా రాకేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ వీడియోకు 2.7 కోట్లకు పైగా  వ్యూస్  రావడం  విశేషం. అసలేం జరిగిందంటే..

జిమ్‌లో ప్రతిరోజూ జరిగే ఒక సాధారణ సందర్భాన్ని, క్లీనర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి జీవితాంతం గుర్తుంచుకోదగ్గ మధుర జ్ఞాపకంగా ఎందుకు మార్చాలనుకున్నారో రాకేష్‌ తన పోస్ట్‌లో వివరించారు. రోజూ జిమ్‌లో తన లంబోర్గిని సూపర్‌కారును ఆరాధనగా చూసే జిమ్‌ క్లీనర్‌ను గమనించారు. తన రాగానే సంతోషంగా తనవైపు చూడటంతోపాటు, ఒకరోజు దానితో ఫోటోలు దిగడం రాకేష్‌ కంట పడింది. ఈ సందర్బంగా ఒకప్పుడు సేల్స్‌మన్‌గా పనిచేస్తూ కేవలం 800 రూపాయల వేతనం పొందుతున్న రోజులను రాకేష్ కుమార్ గుర్తు చేసుకున్నారు.  తాను కూడా ఒక సూపర్ కార్ సొంతం చేసుకోవాలని కలలు కన్న జ్ఞాపకాలు మనసులో కదలాడాయి. అందుకే అతని మనుసులోని కోరికను అర్థం చేసుకున్నారు. అందుకే  తనకి  ఒక మధురమైన అనుభూతిని మిగల్చాలనుకుని  బహుశా క్లీనర్‌  ఎప్పుడూ ఊహించని పని చేశారు.    తన కారు తాళాలు అతని చేతికిచ్చి డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టి కారులో కూర్చునే అవకాశం కల్పించారు.  ఫలితంగా ఆ క్లీనర్  కళ్లలో కనిపించిన ఆనందాన్ని ఆస్వాదించారు. ఈ  ఆనందాన్ని తన ఫాలోయర్లతో కూడా  పంచుకోవాలని భావించారు.

ఇదీ చదవండి: ఆయుధపూజలో ఏకే-47తో ‘లేడీ సింగం’ వీడియో వైరల్‌

గతంలో తాను రూ. 800 జీతానికి సేల్స్‌మన్‌గా పనిచేసే రోజుల్లో సూపర్‌కార్ల యజమానులను చూసి ముచ్చటపడేవాడినని,కానీ అప్పట్లో యజమానులు తన్ను పట్టించుకోలేదని, భవిష్యత్తులో తాను విజయవంతమైతే ఎవరినీ అలా నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు రాకేష్‌ వెల్లడించారు. ఈ హృదయపూర్వక సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో అది  విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లుఆ వ్యాపారవేత్త వినయవిధేయతను, మంచి మనసును ప్రశంసించారు.ఎంత ఎత్తుకు ఎదిగినా తాము నడిచి వచ్చిన దారిని మర్చిపోకూడదని, హోదా పెరిగినా పాత రోజులను మర్చిపోకుండా వినయం, మానవత్వంతో వ్యవహరించిన వ్యాపారవేత్తపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇదీ చదవండి: కన్నతల్లి చేతిలో చిన్నారి హత్య : కన్నీరుమున్నీరవుతున్న తండ్రి
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)