Breaking News

కుక్కలు వెంటపడుతున్నాయన్నా టెన్షన్‌లో.. స్పీడ్‌ పెంచిందంతే..

Published on Tue, 04/04/2023 - 14:13

ఇటీవల కాలంలో కుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక ప్రభుత్వాస్పత్రిలో కుక్క పసిబిడ్డను నోట కరుచుకున్న ఉదంతం మరువక మునుపే మరో ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తుండగా కుక్కలు వెంటపడటంతో వేగం పెంచేశారు. పాపం సమీపంలో పార్క్‌ చేసి ఉన్న కారుని గమనించకుండా ఢీ కొట్టారు. అంతే ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ ఘటన ఒడిశాలోని బెరహంపూర్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. ఒక చిన్నారితో సహా ఇద్దరు మహిళలు స్కూటీపై గుడికి వెళ్లి వస్తున్నారు. ఇంతలో ఆరు కుక్కలు వారి వెంట పడ్డాయి. దీంతో ఆ మహిళ భయంతో స్పీడ్‌ పెంచేసింది. మరోవైపు ఆమె ముందు వైపు చూడకుండా వాటి వైపే చూస్తుండటంతో అక్కడ పార్క్‌ చేసి ఉన్న కారుని గమనించలేదు. దీంతో బండి ఆ కారుని నేరుగా ఢీ కొట్టడంతో ఒక్కసారిగా అంతా కింద పడిపోయారు.

ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ ముగ్గురులో కనీసం ఒక్కరూ కూడా హెల్మెట్‌ ధరించలేదని మండిపడుతుండగా, మరికొందరు ఇలాంటి ఘటనలు తలెత్తకుండా బెరహంపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌  చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. ట్వీట్‌ చేశారు. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

(చదవండి:  డీజే సౌండ్‌ తగ్గించమన్నందుకు..గర్భిణి అని చూడకుండా..)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)