Breaking News

రూ. 500 నోట్ల వర్షం.. ఎంత పనిచేసింది!

Published on Mon, 06/01/2026 - 17:41

ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఒక కోతి చేసిన పనికి తీవ్ర గందరగోళం నెలకింది. ఏకంగా రూ. 2 లక్షల నగదు ఉన్న బ్యాగును లాక్కొని, చెట్టుపైకి ఎక్కి నోట్ల వర్షం కురిపించిన  ఘటన, వీడియో  నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

బులంద్‌షహర్ జిల్లా కోర్టు వెలుపల మే 31నఈ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆస్తి రిజిస్ట్రేషన్ చ స్టాంప్ పేపర్ల కొనుగోలుకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి రూ. 2 లక్షల నగదుతో కోర్టుకు వచ్చాడు. ఇంతలో ఎక్కడనుంచి వచ్చిందో ఒకకోతి హఠాత్తుగా అతని చేతిలోని డబ్బుల బ్యాగును లాక్కొని, ఎవరూ ఊహించని విధంగా పక్కనే ఉన్న వేప చెట్టుపైకి ఎక్కేసింది.

అంతటితో ఆగలేదు.. ఆగితే.. ఎలా? అందుకే కోతి చేష్టలన్నారు.. చెట్టు కొమ్మపై కూర్చున్న ఆ కోతి, బ్యాగును చింపివేసి అందులోని రూ. 500 నోట్లను గాల్లోకి విసరడం ప్రారంభించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గాల్లోంచి నోట్లు కిందకు రాలుతుండటంతో చెట్టు కింద ఉన్న జనం ఎగబడ్డారు. నోట్లను దక్కించుకునేందుకు కోర్టుకు వచ్చిన లాయర్లు, క్లయింట్లు, బాటసారులు అంతా ఒకేచోట చేరడంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.

చివరికి స్థానికులు, అధికారుల సహాయంతో చాలా శ్రమించి చాలావరకు డబ్బును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అయితే కొన్ని నోట్లు చిరిగిపోగా, మరికొంత   నగదు దొరకకుండా పోయినట్లు సమాచారం. అదృష్ట వశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్‌లోనూ సూపర్‌ స్టారే!

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్‌లో విపరీతంగా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ పెట్టారు. డబ్బులు చెట్లకు కాస్తాయా? అని అడిగేవారికి ఇదే సమాధానం!" అని ఒకరు కామెంట్ చేయగా, సమాజంలో ఆర్థిక సమానత్వం కోసం ఆ కోతి 'న్యాయవాది'లా పోరాడుతోంది" అని మరొకరు చమత్కరించారు. భారతీయ మార్కెట్లలో ప్రస్తుత రీటైల్ లిక్విడిటీకి ఇదొక చక్కని ఉదాహరణ. డబ్బు ప్రతిచోటా ఎగురుతోంది, కానీ ఫండమెంటల్స్ మాత్రం ఇంకా చెట్లపైనే ఊగుతున్నాయి" అని కొందరు మార్కెట్ విశ్లేషణలతో ముడిపెట్టారు.

ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా!

 కాగా ఈ ప్రాంతంలో కోతుల బెడద ఎప్పుడూ ఉండేదేనని, ఫోన్లు, ఆహార పదార్థాలను లాక్కెళ్లడం సాధారణమే అయినా, ఇంత పెద్ద మొత్తంలో డబ్బును లాక్కొని నోట్ల వర్షం కురిపించడం మాత్రం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సందడి : ఎద్దుల బండి ఊరేగింపు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)