Breaking News

ఉదయ్‌నిధికే మా మద్దతు: ప్రేమలత విజయ్‌కాంత్‌

Published on Tue, 08/04/2026 - 12:27

తమిళనాట ఉదయ్‌నిధి స్టాలిన్‌ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సీఎం విజయ్‌, నటి త్రిషలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ కేసు నమోదు చేసి ఆయన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓవైపు పలువురు ఉదయ్‌నిధి వ్యాఖ్యల్ని తప్పుబడుతుంటే.. డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయ్‌కాంత్‌ మాత్రం ఆ అరెస్ట్‌ను ఖండించారు.

డీఎంకే నేత, ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్‌పై పోలీసు చర్యల నేపథ్యంలో మంగళవారం డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్‌ మీడియా ఎదుట కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయ్‌నిధి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పేర్కొంటూ.. ఆయనకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో రాజకీయ భిన్నాభిప్రాయాలను అరెస్టులతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రభుత్వాన్ని విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని ప్రేమలత విజయకాంత్‌ అన్నారు. ఒకరి వ్యాఖ్యలను మరో పార్టీ రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప.. అరెస్టులు పరిష్కారం కాదని పేర్కొన్నారు. స్వతంత్ర భారతంలో రాజకీయ వ్యాఖ్యలపై అరెస్టులు చేయడం ప్రజల్లో అసంతృప్తిని, ప్రజాస్వామ్యంపై అనుమానాలను పెంచుతుందని వ్యాఖ్యానించారు.

“ఉదయ్‌నిధి మాట్లాడిన దాంట్లో తప్పు లేదు”
ఉదయ్‌నిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన ప్రేమలత.. ఆయన మాటల్లో తప్పేమీ లేదని అన్నారు. రాజకీయ వేదికలపై ప్రతిపక్ష నేతలకు తమ అభిప్రాయాలను చెప్పే హక్కు ఉందని స్పష్టం చేశారు. “ఉదయ్‌నిధికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. అందులో అభ్యంతరకరం ఏంటో అర్థం కావడం లేదు” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

నీటి కోసం మేం పోరాడుతుంటే..
ఇదే సమయంలో తమిళనాడులోని రాజకీయ పోరాటాలపై కూడా ప్రేమలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలపై, ముఖ్యంగా కావేరీ జలాల సమస్యల పరిష్కారం కోసం తాము పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు నటుడు విజయ్‌ రాజకీయ పోరాటం చేస్తున్న తీరును ప్రస్తావిస్తూ.. “మేం నీటి కోసం పోరాడుతుంటే.. నటి కోసం విజయ్‌ పోరాడుతున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.

అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు
రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకు అరెస్టులను ఉపయోగించడం సరైన విధానం కాదని ప్రేమలత విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఉన్న హక్కులే ప్రతిపక్షాలకు కూడా ఉంటాయని అన్నారు.

అధికార పార్టీ, ముఖ్యమంత్రి తమ అభిప్రాయాలను రాజకీయ వేదికలపై వ్యక్తం చేయవచ్చని.. అదే విధంగా ప్రతిపక్షాలు కూడా తమ వైఖరిని ప్రజల ముందుకు తీసుకెళ్లే హక్కు కలిగి ఉంటాయని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలను ఎదుర్కోవాల్సింది రాజకీయంగానే కానీ.. అరెస్టులతో కాదని స్పష్టం చేశారు.

చట్టం అందరికీ సమానంగా ఉండాలి
ఇటీవల రాణిపేటలో జర్నలిస్టులపై జరిగిన దాడి విషయంలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలను ప్రస్తావించిన ప్రేమలత.. ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై మాత్రం తక్షణ చర్యలు తీసుకోవడం చట్ట అమలులో సమానత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ముందు ప్రతిపక్ష నేతపై అరెస్టు చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తగదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాలని కోరారు. మొత్తంగా.. ఉదయ్‌నిధి స్టాలిన్‌ విషయంలో ప్రేమలత విజయకాంత్‌ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. 

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)