Breaking News

‘మారుతి’ కార్లు అంటేనే ఇక్కడ అపశకునమట!

Published on Thu, 11/27/2025 - 19:34

దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో నమ్మకం ఆచారాలు ఉంటాయి. కానీ మారుతీ  కార్లను బ్యాన్‌ చేసిన గ్రామం గురించి తెలుసా?   మహారాష్ట్రలోనే ఈ  ప్రత్యేకమైన  గ్రామం ఉంది.  ఇక్కడ మారుతి కార్లపై నిషేధం ఎందుకు? ఆ కార్ల నాణ్యత నచ్చలేదా? లేక ధరలు ఎక్కువని భావించారా? పదండి తెలుసుకుందాం.  

మనీ కంట్రోల్‌ కథనం ప్రకారం రాష్ట్రంలోని అహ్మద్ నగర్ జిల్లాలో  ఆ గ్రామం సాధారణ భారతీయ గ్రామం కాదు. ఆధునిక జీవితం పురాతన  నమ్మకాలతో  మిళితమైన గ్రామం అని  చెప్పవచ్చు. ఈ నిషేధం వెనుక కారణం కారు నాణ్యత కారు, అధిక ధరలూ కాదు.  స్థానిక పురాణాల గాథ ప్రకారం సంరక్షక దేవత నింబ దైత్య పట్ల భక్తితో లోతుగా ముడిపడి ఉంది.

ధైర్యాన్నిచ్చి, కష్టాలను తొలగించి, కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడని భక్తులు బాగా విశ్వసించే  శ్రీరాముడికి  గొప్ప సేవకుడు భక్తుడు హనుమంతుడి దేవాలయాలు ఉండవు. మారుతిని ఇక్కడ పూజించరు. ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం. ఇక్కడ  రాక్షస రాజైన నింబ దైత్యుడిని పూజిస్తారు. ఇక్కడి ప్రజలు దైత్య నింబ రాక్షసుడుని తమ మూలపురుషుడిగా భావిస్తారు. చిన్నా పెద్దా అందరికీ నింబ దైత్య అంటే బలమైన నమ్మకం. తరతరాలుగా  చెప్పుకుంటున్న స్థానిక పురాణం ప్రకారం, హనుమంతుడు , నింబ దైత్య మధ్య ఒకప్పుడు వివాదం జరిగింది. చివరికి  రాముడు స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన తర్వాత, రాముడు నింబ దైత్యుడికి ఈ గ్రామానికి ఏకైక దైవ సంరక్షకుడిగా ఉండే హక్కును ఇచ్చాడని నమ్ముతారు, హనుమంతుడిని ఈ పాత్ర నుండి తప్పుకోవాలని కోరాడట  శ్రీరాముడు. దీని కారణంగా, హనుమంతుడి ఉనికి ఏ రూపంలోనైనా ఉండటం గ్రామానికి దురదృష్టాన్ని తెస్తుందనే  నమ్మకం పెరిగింది. ఈ నమ్మకం దేవాలయాలు, పేర్లకు కూడా విస్తరించింది. అలా "మారుతి" అనేది హనుమంతుడికి మరొక పేరు కాబట్టి, ఈ బ్రాండ్ కార్లను అపశకునంగా భావిస్తారట. ఇక్కడ మారుతి కారు  బిగ్గరగా హారన్ వినడం కూడా చెడ్డ శకునంగా భావిస్తారు. మూఢనమ్మకం అని అందరూ పిలుస్తున్నప్పటికీ, శతాబ్దాలుగా తమను రక్షిస్తున్న  పవిత్ర సంప్రదాయం  అంటారు ఈ గ్రామ ప్రజలు.

 ఇదీ చదవండి: స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్‌

గ్రామంలోని ప్రజలు తరచుగా పంచుకునే ఒక ప్రసిద్ధ కథ ఉంది. సంవత్సరాల క్రితం, ఒక స్థానిక వైద్యుడు మారుతి 800 కారును కొన్నాడట. ఆ తరువాత క్లినిక్‌కు వచ్చే రోగుల సంఖ్య అకస్మాత్తుగా  తగ్గిపోయింది. దీంతో ఆందోళన పడిన అతగాడు,మారుతి కారుని విక్రయించి, దానిని వేరే బ్రాండ్, టాటా సుమోతో భర్తీ చేశాడు. మారిన తర్వాత, అతని ప్రాక్టీస్ సాధారణ స్థితికి వచ్చిందట. 

(రూ. 80 లక్షల తల్లి పెన్షన్‌ కోసం ఏ కొడుకూ చేయని పని!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)