Breaking News

నితీశ్‌ కుమార్‌కు పాక్‌ గాంగ్‌స్టర్‌ బెదిరింపులు, డీజీపీ స్పందన

Published on Thu, 12/18/2025 - 12:46

పట్నా: హిజాబ్‌ వివాదంలో చిక్కుకున్న బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar)కు సంబంధించి  ఒక బెదిరింపు వీడియో ఒకటి సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ సంఘటపై కాంగ్రెస్‌, ఆర్జేడీ తీవ్రంగా స్పందించాయి. నితీశ్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేయగా, నితీశ్‌ మానసిక స్థితిపై ఆర్జేడీ  ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే బిహార్‌  సీఎం వెంటనే ఆ మహిళకు బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాలి అని  నటి జైరా వసీం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నితీష్ కుమార్‌కు పాకిస్తాన్‌కు చెందిన ఒక గ్యాంగ్‌స్టర్  ద్వారా సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది.

పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టి ఈ సంఘటనపై క్షమాపణ చెప్పాలని  సీఎంను డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. ముస్లిం మహిళతో నితీష్‌ ప్రవర్తించిన తీరును ప్రస్తావిస్తూ భట్టి సదరు మహిళకు క్షమాపణ చెప్పకపోతే  తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.  బాధ్యతా యుతమైన పదవిలో ఉండి ఇలా ప్రవర్తించడం తగదని వ్యాఖ్యానించినట్టు సమాచారం.

ఈ వీడియోపై ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, బిహార్‌ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) వినయ్‌కుమార్‌ స్పందించారు. ఈ విషయాన్ని పరిశీలించమని పట్నా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను కోరినట్లు చెప్పారు. ఇంతకుమించి ప్రస్తుతానికి వివరాలేమీ లేవంటూ, తదుపరి వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు, ఈ వీడియోపై అధికారిక విచారణ అనంతరం, బెదిరింపులను పరిశీలిస్తామన్నారు. 

;

 

కాగా పట్నాలో ఆయుష్‌ డాక్టర్లకు సర్టిఫికెట్ల ప్రదానం సందర్భంగా ఒక  మహిళా డాక్టర్‌ హిజాబ్‌ను (Hijab) దించి మరీ ముఖాన్ని చూడటంపై దుమారం రేపింది.

ఇదీ చదవండి: మెస్సీకి అనంత్‌ అంబానీ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌, ఖరీదెంతో తెలుసా?

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)