Breaking News

లోక్‌సభలో ప్రియాంక సీటింగ్‌ ఖరారు.. మోదీ, రాహుల్‌ స్థానాలు కూడా!

Published on Tue, 12/03/2024 - 16:23

18వ లోక్‌సభలో ఎంపీల సీటింగ్ ఏర్పాట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  సీటులో ఎలాంటి మార్పు లేదు. గతంలో మాదిరి ఆయన ముందు వరుసలోని తొలి సీట్లో కూర్చోనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండో స్థానంలో, హోంమంత్రి అమిత్ షా మూడో సీట్‌ నెంబర్లో కూర్చోనున్నారు. గతంలో సీటు నెంబర్‌ 58లో కూర్చొనే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇకపై 4వ స్థానానికి మారారు. 

 ఇక వయనాడ్‌ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ నాలుగో వరుసలో స్థానం కేటాయించారు. ఈ మేరకు సోమవారం సవరించిన సీటింగ్‌ జాబితాను విడుదల చేశారు.

గతంలో సీట్‌ నెంబర్‌ 4, 5 ఖాళీగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని వేరే వారికి కేటాయించారు. అదే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా వంటి కీలక మంత్రులకు స్థిరమైన సీట్లు ఖాళీగానే ఉండనున్నాయి.

రాహుల్‌ గాంధీ 498వ స్థానంలో..
వీరితోపాటు సీనియర్ ప్రతిపక్ష నేతల సీట్లు మొదటి వరుసలో ఉంటాయి. కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ 498వ స్థానంలో కూర్చుంటారు., సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ 355వ స్థానంలో కూర్చోనున్నారు. లోక్‌సభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సుదీప్‌ బందోపాధ్యాయకు 354వ సీటు కేటాయించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌కు రాహుల్ గాంధీ పక్కనే సీటు నంబర్ 497 కేటాయించారు. 

సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ కు లోక్ సభ రెండో వరుసలో స్థానం కల్పించారు. ఫైజాబాద్‌ నుంచి గెలిచిన ఆయన ఇప్పుడు  సీటు నంబర్ 357లో కూర్చుంటారు. డింపుల్ యాదవ్ 358 సీటులో అతని పక్కన కూర్చుంటారు. ఇకప ప్రియాంక గాంధీ నాలుగో వరుసలో 517వ సీట్లో కూర్చోనున్నారు. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు కేరళకు చెందిన అదూర్ ప్రకాష్,  అస్సాంకు చెందిన ప్రద్యుత్ బోర్డోలోయ్ పక్కన ఆమె కూర్చుంటారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)