Breaking News

కాంగ్రెస్ నేతలకు నితిన్ గడ్కరీ లీగల్ నోటీసు

Published on Sat, 03/02/2024 - 10:41

ఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కాంగ్రెస్‌నేతలకు చట్టపరమైన నోటీసులు పంపారు. ఓ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కాంగ్రెస్‌ నేతలు వక్రీకరించారని ఎఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌కు లీగల్‌ నోటీసులు ఇచ్చారు.  ‘కేంద్ర మంత్రి గడ్కరీ కాంగ్రెస్‌ పోస్ట్‌ చేసిన 19 సెకండ్ల వీడియో క్లిప్‌ను చూసి షాక్‌ అయ్యారు. ఆయన మాట్లాడిన మాటలు, వాటి అసలు అర్థాన్ని కాంగ్రెస్‌ నేతలు వక్రీకరించారు’ అని  న్యాయవాది బాలేందు శేఖర్‌ తెలిపారు.

గందరగోళాన్ని, అపకీర్తిని సృష్టించడానికి నితిన్‌ గడ్కరీ మాటాలను వక్రీకరించారని  పేర్కొన్నారు.  కాంగ్రెస్‌ నేతలు పోస్ట్‌ చేసిన ఆ వీడియో క్లిప్‌ను తొలగించాలని లిగల్‌ నోటీసులు పంపినట్లు తెలిపారు. మూడు రోజుల్లో తన క్లైంట్‌కు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని లాయర్‌ బాలేందు శేఖర్‌ తెలిపారు.

వీడియో క్లిప్‌లో ఏం ఉంది?
జాతీయ మీడియా చానెల్‌కు నితిన్‌ గడ్కరీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఓ అంశాన్ని వివరించే క్రమంలో.. ‘గ్రామీణ ప్రజలు, కూలీలు, రైతులు సంతోషంగా లేరు. గ్రామాలకు సరైన రోడ్లు లేవు. తాగడానికి కనీసం తాగునీరు లేదు. నాణ్యమైన ఆస్పత్రులు, పాఠశాలలు లేవు’ అని  అన్నారు. అయితే కేవలం ఈ మాటలను మాత్రమే ఉన్న ఓ క్లిప్‌ను కాంగ్రెస్‌ పార్టీ తమ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 19 సెకండ్ల వీడియో క్లిప్‌పై కేంద్రమంత్రి గడ్కరీ తీవ్ర అభ్యంతరం తెలిపారు.

తన మాటలను కాంగ్రెస్‌ పార్టీ నేతలు కావాలనే వక్రీకరించారని గడ్క​రీ అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించిన కాంగ్రెస్‌ నేతలకు లీగల్‌ నోటీసులు పంపినట్లు తెలిపారు. తన వీడియో క్లిప్‌ను 24 గంటల్లో డిలీట్‌ చేసీ.. కాంగ్రెస్‌ నేతలైన మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌లు మూడు రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణలు తెలిపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)