Breaking News

కేరళలో మళ్లీ నిపా వైరస్‌ కలకలం : హై అలర్ట్‌

Published on Thu, 06/11/2026 - 13:13

కేరళలో మరో సారి నిపా వైరస్‌ (Nipah Virus) కలకలం రేపుతోంది. కోజికోడ్‌లోని ఫెరోక్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో నిపా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కేరళ ఆరోగ్య అధికారులు అప్రమత్త మయ్యారు.  ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగానే ఉందని  పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)   రిపోర్ట్‌ కోసం  ఎదురు చూస్తున్నామని  ఆరోగ్య అధికారులు తెలిపారు.

ప్రాథమిక పరిశీలన ప్రకారం, రోగికి మొదట మామూలు జ్వరం వచ్చి తగ్గింది, ఆ తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. నిపా అనుమానిత కేసుగా గుర్తించడానికి ముందు పలు ఆసుపత్రిలను సందర్శించిన తరువాత సదరు రోగి  ప్రభుత్వ ఆసుపత్రి అవుట్‌పేషెంట్  విభాగానికి వచ్చారు. దీంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక గిడ్డంగిని శుభ్రం చేస్తున్నప్పుడు అతనికి ఈ ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ప్రదేశంలో వైరస్ సోకిన గబ్బిలాలు ఉండటమే వైరస్ వ్యాప్తికి ప్రాథమిక కారణమని దర్యాప్తు అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన మూలాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.   

ఇదీ చదవండి: రూ. 954 కోట్ల స్కాం : భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్‌

దీంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించి, తదుపరి చర్యలు తీసుకోనేందుకు  గురువారం తిరువనంతపురంలోని ఆరోగ్యమంత్రి  కె. మురళీధరన్ కార్యాలయంలో సీనియర్ ఆరోగ్య అధికారులతో సమావేశం కానున్నారు. ఆరోగ్య అధికారులు ఇప్పటికే కాంటాక్ట్-ట్రేసింగ్ చర్యలను ప్రారంభించారని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆరోగ్య మంత్రి  ప్రకటించారు. 

ఆందోళన  వద్దు : కేరళ ఆరోగ్య మంత్రి
బాధిత వ్యక్తి చాలా మందిని కలిసినప్పటికీ, ప్రస్తుత దశలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  మంత్రి స్పష్టం చేశారు. సంబంధిత రోగి చికిత్స కోసం వెళ్లిన ప్రైవేట్ ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించారని, దీనివల్ల ఇతరులకు కూడా వైరస్ వ్యాపించి ఉండవచ్చనే ఆందోళనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా, ఆ రోగి వెళ్లినఆసుపత్రి సిబ్బందిని క్వారంటైన్‌లోకి వెళ్లాలని ఆదేశించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: వాహనదారులకు గుడ్‌ న్యూస్‌, ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రద్దు

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)