Breaking News

హనీమూన్‌లో గొడవ?.. నవ జంట బలవన్మరణం

Published on Mon, 12/29/2025 - 02:42

కొత్తగా పెళలైన ఆ జంట.. హనీమూన్‌కు వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో తెలీయదు. తిరిగి రాగానే ఆమె ప్రాణం తీసుకుంది. అది తట్టుకోలేకనో.. కేసు భయం వల్లనో.. అతడు దూరంగా పారిపోయాడు. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పచ్చని పందిళ్లు వేసి మూడు నెలలు తిరగకముందే.. ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది ఇప్పుడు.. 

బెంగళూరు: బెంగళూరుకు చెందిన సూరజ్ శివన్న (36), గణవి (26) జీవితం అర్ధాంతరంగా ముగిసింది. గణవి మొదట బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడగా, రెండు రోజుల తర్వాత సూరజ్ మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఒక హోటల్‌లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

అక్టోబర్‌ 29వ తేదీన ఈ జంటకు వివాహం జరిగింది. అయితే ఈ మధ్యే హనీమూన్ కోసం శివన్న, గణవి శ్రీలంకకు వెళ్లారు. అక్కడి వెళ్లిన ఆ జంటకు మధ్యలోనే గొడవలు తలెత్తడంతో తిరిగి బెంగళూరుకు వచ్చారు. గణవి తన పుట్టింటికి వెళ్లింది. అత్తింట్లో ఎదురైన అవమానం, తిరస్కారం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైందని ఆమె కుటుంబం ఆరోపిస్తుండగా..  డిసెంబర్ 23న ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో చేరింది. రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఆమె చివరికి మృతి చెందింది.

గణవి మరణం తర్వాత ఆమె కుటుంబం సూరజ్, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల మధ్య సూరజ్ తన తల్లి జయంతితో కలిసి బెంగళూరును విడిచి నాగపూర్‌కి వెళ్లాడు. అక్కడ వార్ధా రోడ్‌లోని ఒక హోటల్‌లో ఉరి వేసుకుని మృతి చెందాడు. అదే సమయంలో అతని తల్లి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ ఘటన కొత్తగా పెళ్లైన జంట జీవితం ఎంతటి విషాదాంతానికి దారితీసిందో చూపిస్తోంది. కుటుంబ తగాదాలు, వరకట్న వేధింపులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు సమాజంలో ఇంకా ఎంతటి ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నాయో మరోసారి స్పష్టమైంది.

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)