Breaking News

ఇజ్రాయెల్‌ స్వాతంత్య్ర దినోత్సవాల్లో మచ్ఛార్‌తో కలిసి జ్యోతి వెలిగించండి 

Published on Fri, 10/23/2026 - 02:12

న్యూఢిల్లీ:  ఇజ్రాయెల్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జ్యోతి వెలిగించడానికి రావాలని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఫ్లై దుబాయ్‌ విమానంలో సహ పైలట్‌ దాడిని ఎదుర్కొని, 174 మంది ప్రయాణికులను రక్షించిన భారత కెపె్టన్‌ స్మిత్‌ మచ్ఛార్‌తో కలిసి ఇజ్రాయెల్‌కు రావాలని, ఇద్దరు కలిసి జ్యోతి వెలిగించాలని కోరారు. 

నెతన్యాహు గురువారం మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియా పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని తక్షణమే పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని వారు తేల్చిచెప్పారు. అలాగే భారత్‌–ఇజ్రాయెల్‌ సంబంధాల్లో కొనసాగుతున్న పురోగతిని మోదీ, నెతన్యాహు స్వాగతించారు. 

ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం మోదీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. భారత్, ఇజ్రాయెల్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని తాము సమీక్షించామని తెలిపారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)