Breaking News

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహాకుంభ్‌ యాత్రికులు మృతి

Published on Sun, 02/02/2025 - 09:56

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. కుంభమేళా సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలతో పాటు విషాదకర ఉదంతాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అటువంటి ఉదంతం బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని మధుబని నాలుగు లేన్‌ల రోడ్డులో చోటుచేసుకుంది.

బైక్ రైడర్లను కాపాడే ప్రయత్నంలో స్కార్పియో వాహనం(Scorpio vehicle) రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో స్కార్పియోలోని ఐదుగురు అక్కడికక్కడే  మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ ఎస్పీ విద్యా సాగర్ తన బృందంతోపాటు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఎస్‌కేఎంసీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

మీడియాకు అందిన వివరాల ప్రకారం నేపాల్‌లోని మొహతారికి చెందిన కొందరు  ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో జరుగుతున్న మహా కుంభ్‌లో స్నానం చేసి, స్కార్పియో వాహనంలో తిరిగి నేపాల్‌ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి స్థానికులు మాట్లాడుతూ  ఈ ఘటనకు ముందు కొంతమంది యువకులు నాలుగు లేన్లలో బైక్‌లపై విన్యాసాలు చేస్తుండగా, ఒక స్కార్పియో వాహనం చాలా వేగంగా వారికి ఎదురుగా వచ్చిందన్నారు. ఆ వాహనం బైక్ నడుపుతున్నవారిని తప్పించే ప్రయత్నంలో డివైడర్‌ను ఢీకొని, ఆపై బోల్తా పడిందన్నారు. ఇది చూసిన ఆ యువకులు బైక్‌లతో సహా అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. స్కార్పియో వాహనం మూడు సార్లు బోల్తా పడటంతో దానిలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని వివరించారు. కాగా మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)