Breaking News

బెంగళూరులో భారీ చోరీ.. కిలేడీ జంట ఎక్కడ?

Published on Thu, 01/29/2026 - 08:57

బెంగళూరు: కర్ణాటకలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. ప్రముఖ బిల్డర్ ఇంట్లో పని మనుషులుగా చేరిన నేపాలీ జంట.. ఆ ఇంటికే కన్నం పెట్టారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. సుమారు రూ. 18 కోట్ల విలువైన ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. నిందితులు నేపాల్ సరిహద్దు దాటి వెళ్లే అవకాశం ఉండటంతో బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దీంతో, ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని మారతహళ్లి పరిధిలో యెమలూరు కెంపాపుర నివాసి, బిల్డర్​ షిమంత్​ అర్జున్ ఇంట్లో ఆదివారం దొంగతనం జరిగింది. దాదాపు రూ.18 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, వెండి నగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఇంటి యజమాని షిమంత్​ తన భార్య పిల్లలతో ఓ భూమి పూజ కార్యక్రామానికి వెళ్లగా అదే అదనుగా  ఇంట్లో పనిమనుషులుగా ఉన్న నేపాలి జంట దినేష్​, కమలా మరో నేపాలితో కలిసి చోరీకి పాల్పడ్డారు. షిమంత్​ కుటుంబం బయటికి వెళ్లినప్పుడు మొదటి అంతస్తులోని బెడ్​ రూంలో చొరబడి లాకర్ పగలగొట్టి 1.5 కిలోల బంగారం, దాదాపు 5 కిలోల వెండి ఆభరణాలు, రూ.11.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారని పోలీసులు గుర్తించారు.

యజమానులు తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లై ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. అయితే, వీరు గత కొంతకాలంగా సదరు బిల్డర్ ఇంట్లో పని మనుషులుగా ఉంటూ యజమానికి నమ్మకంగా ఉంటున్నారు. ఇంటి గురించి పూర్తి అవగాహన ఉండటంతో, వీరు అతి సులువుగా లాకర్లను గుర్తించి చోరీకి పాల్పడ్డారు. నేరం చేసిన వెంటనే వారు సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్తపడి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ టీవీ కెమెరాల పరిశీలించి నిందితులకోసం గాలిస్తున్నారు. యజమానుల ఇంట్లో పనిమనుషులు చేసిన అతిపెద్ద దొంగతనాల్లో ఇదే పెద్దదని పోలీసులు అంటున్నారు.

కాగా, నిందితులు నేపాల్ సరిహద్దు దాటి వెళ్లే అవకాశం ఉండటంతో, బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. పని మనుషులను పెట్టుకునే ముందు వారి నేపథ్యాన్ని తనిఖీ చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)