Breaking News

బాయ్‌ఫ్రెండ్‌ని కట్టేసి, నీట్‌ విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌

Published on Fri, 07/24/2026 - 16:43

ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ ప్రాంతంలో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన 20 ఏళ్ల నీట్ (NEET) విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.  దిగ్భ్రాంతి రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన 20 ఏళ్ల యువతి రాజస్థాన్‌లోని కోటాలో ఉంటూ నీట్ (NEET) పరీక్షకు సన్నద్ధమవుతోంది. ఆమె కొద్ది రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చింది. ఆమె సోషల్ మీడియా ద్వారా పరిచయమైన 17 ఏళ్ల మైనర్ ఫ్రెండ్‌ను కలవడానికి చిత్రకూట్‌కు వచ్చింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారు బైక్‌పై దేవాంగన లోయ వద్ద ఉన్న గుట్టపైకి వెళ్లారు. ఇది గమనించిన కొంతమంది దుండగులు నకిలీ అధికారులు అవతారం ఎత్తారు.  

వీరిద్దరూ సోషల్ మీడియా రీల్స్ చేసుకుంటుండగా, ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అక్కడికి వచ్చారు. తాము అటవీ శాఖ అధికారులమని చెప్పి బెదిరించారు. అబ్బాయిపై బెల్టుతో తీవ్రంగా కొట్టి, అతడి చేతులు, కాళ్లను బంధించారు. ఆ తర్వాత యువతిని బలవంతంగా సమీపంలో ఉన్న పొదల్లోకి ఈడ్చుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అరిస్తే గుట్టపై నుంచి కిందకు తోసేస్తామని బెదిరించారు. అనంతరం అక్కడినుంచి ఉడాయించారు.  చివరికి అబ్బాయి ఎలాగో తప్పించుకొని పోలీసు అత్యవసర హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు.

ఇదీ చదవండి: ఐఫోన్‌ రాలేదు, ఆయిల్‌ వచ్చింది.. కట్‌ చేస్తే రూ. 1.81 లక్ష

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించగా, గాయపడిన అబ్బాయికి ప్రాథమిక చికిత్స అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. సిసిటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగాఅనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రయాగ్‌రాజ్ జోన్ అడిషనల్ డీజీ జ్యోతి నారాయణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: 150 పిజ్జాలు, రూ. 75 వేలు : జంతర్‌ మంతర్‌లో మానవత్వపు పరిమళాలు

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)