Breaking News

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ చార్జిషిట్‌ స్వీకరించలేం

Published on Wed, 12/17/2025 - 03:25

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్‌ గాందీతోపాటు మరో ఐదుగురికి ఊరట లభించింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీ కోర్టు మంగళవారం నిరాకరించింది. చార్జిషిట్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా కాకుండా, ప్రైవేట్‌ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై జరిపిన విచారణ ఆధారంగా చార్జిషీట్‌ దాఖలు చేశారని ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి విశాల్‌ గాగ్నే తప్పుపట్టారు.

చట్టప్రకారం దీన్ని స్వీకరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు న్యాయమూర్తి గుర్తుచేశారు.  మనీ లాండరింగ్‌ వ్యవహారంలో సోనియా గాం«దీ, రాహుల్‌ గాం«దీ, మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్, సుమన్‌ దూబే, శామ్‌ పిట్రోడాతోపాటు యంగ్‌ ఇండియా కంపెనీ పాత్ర ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తోంది.

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌)కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను వారు అక్రమంగా కొట్టేశారని చెబుతోంది. యంగ్‌ ఇండియా కంపెనీలో సోనియా గాం«దీకి 76 శాతం వాటా ఉంది. ఏజేఎల్‌కు ఈ కంపెనీ రూ.90 కోట్లు రుణంగా ఇచ్చింది. రుణాన్ని తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఏజేఎల్‌ ఆస్తులను కుట్రపూరితంగా లాక్కున్నారని ఈడీ వాదిస్తోంది. మరోవైపు ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వుపై అప్పీల్‌ చేస్తామని ఈడీ వెల్లడించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)