Breaking News

అంబేడ్కర్‌కు బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ శత్రువులు: ఖర్గే 

Published on Tue, 04/15/2025 - 05:24

న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌పై ఎటువంటి అభిమానం లేదని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మోదీ ప్రభుత్వం అంబేడ్కర్‌ కృషిని ప్రశంసించడం కేవలం మాటలకే పరిమితమన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. వాస్తవానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు అంబేడ్కర్‌కు శత్రువులని ధ్వజమెత్తారు. 

అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ అవమానించిందంటూ ప్రధాని మోదీ చేస్తున్న ఆరోపణలపై ఆయన ఈ మేరకు స్పందించారు. 1952 ఎన్నికల్లో తన ఓటమికి కమ్యూనిస్ట్‌ నేత ఎస్‌ఏ డాంగే, హిందుత్వ వాది వీడీ సావర్కర్‌లే కారణమంటూ బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన ఒక లేఖను ఈ సందర్భంగా ఖర్గే మీడియాకు చూపారు.  సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం దక్కేలా డాక్టర్‌ అంబేడ్కర్‌ పౌరులకు రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చారని కొనియాడారు.

 ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో కూడా ఎస్‌సీ,ఎస్‌టీ, ఓబీసీల రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్త కులగణనను వెంటనే చేపట్టాలన్నారు. ప్రభుత్వం పథకాలను అమలు చేసేందుకు ఇప్పటికీ 2011 జనగణనే ఆధారంగా చేసుకుంటోందని తెలిపారు. 2021లో చేపట్టాల్సిన జనగణన ప్రస్తావనను ప్రభుత్వం తేవడం లేదన్నారు. జనగణన, కులగణనను చేపట్టి సమాజంలోని అన్ని వర్గాలకు సమ న్యాయం చేయాలన్నారు. 
 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)