Breaking News

దత్తత హిందూ సోదరికి, ముస్లిం వ్యక్తి కన్యాదానం, వైభవంగా పెళ్లి

Published on Sat, 07/11/2026 - 15:29

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో జరిగిన ఒక వివాహం మత సామరస్యానికి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ముస్లిం యువకుడైన బబ్లూ సిద్ధిఖీ, తన పెంపుడు సోదరి దీపాన్షి వివాహ బాధ్యతలను పూర్తిగా తన భుజాలపై వేసుకున్నాడు.హైందవ సంప్రదాయాల ప్రకారం జరిపించిన తీరు స్థానికంగానే కాక సోషల్ మీడియాలోనూ ప్రశంసలందుకుంటోంది.

తండ్రి తరువాత తండ్రి
కొన్నేళ్ల క్రితమే దీపాన్షి తల్లిదండ్రులు చనిపోయి ఒంటరిగా మిగిలిపోయింది. దీంతో  పొరుగున ఉండే  బబ్లూ సిద్ధిఖీ, ఆమెను తన సొంత చెల్లెలిలా ఆదరించాడు.  బబ్లూ కుటుంబం ఆమెకు అండగా నిలిచింది. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు లేరనే వెలితి ఆమెకు తెలియకుండా బబ్లూ కుటుంబం ఆమె జీవితంలో ప్రతి అడుగులో తోడుగా నిలిచింది.  ఆమెకు యుక్తవయసు రావడంతో పెద్దమనసు చేసుకొని  వైభంగా పెళ్లి చేశారు.  కాళ్లు క డిగి కన్యాదానం చేసి చక్కటి విందు ఇవ్వడం  విశేషంగా నిలిచింది.  

జులై 8న హిందూ సంప్రదాయాల ప్రకారం ఉఝానిలోని ఎస్ఎస్ గ్రీన్ ప్యాలెస్‌లో దీపాన్షి, కమల్‌కాంత్‌ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయంల అత్యంత పవిత్రమైన 'కన్యాదానం' క్రతువును బబ్లూ సిద్ధిఖీ స్వయంగా నిర్వహించాడు.  దాదాపు 800 మంది అతిథులకు భోజన వసతులతో పాటు పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నాడు.

కన్నప్రేమ కంటే పెంచిన ప్రేమ మిన్న
‘‘దీపాన్షి చిన్నప్పటి నుంచి నా సొంత చెల్లెలా చూసుకున్నా. తమ కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. ప్రేమ, నమ్మకంతో ఏర్పడే బంధాలు రక్తసంబంధాల కంటే తక్కువేమీ కావు. ఏ ఆడపిల్ల కూడా తన పెళ్లి రోజున ఒంటరినని బాధపడకూడదు. ఒక సొంత అన్నగా చెల్లెల్నిఎంత గౌరవంగా, సంతోషంగా అత్తవారింటికి పంపాలో, అలాగే పంపించాను" అని బబ్లూ సిద్ధిఖీ గర్వంగా చెప్పాడు.

కన్నీళ్లు పెట్టుకున్న వధువు
పెళ్లి సమయంలో దీపాన్షి పలుమార్లు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. బబ్లూ భయ్యా, వారి కుటుంబం సొంత కూతురి కంటే మిన్నగా చూసుకున్నారు. తల్లిదండ్రులు లేరనే బాధ నాకు కలగనివ్వలేదు. సామాజిక, మతపరమైన వ్యత్యాసాల కంటే ప్రేమాభిమానాలే గొప్పవని మా అన్న నిరూపించాడు అంటూ భావోద్వేగానికి లోనైంది. నీరు నిండిన  కళ్ళతో వారికి కృతజ్ఞతలు తెలిపింది.

ఇదీ చదవండి: ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ వినూత్న ప్రయోగం : 100 గొర్రెలతో..!

నెటిజన్ల ప్రశంసలు
ఈ పెళ్లికి హాజరైన స్థానికులు బబ్లూ సిద్ధిఖీ మానవత్వాన్ని, మతసామరస్యాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు . సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ కావడంతో, నెటిజన్లు "నిజమైన భారతదేశం అంటే ఇదే" అంటూ ఈ అన్నాచెల్లెళ్ల బంధాన్ని, బబ్లూ సంస్కారాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. మతాల పేరుతో సమాజంలో విభేదాలు తలెత్తుతున్న ఈ రోజుల్లో బబ్లూ మతంకంటే మానవత్వం మిన్న అని చాటిచెప్పాడు అంటూ కొనియాడు తున్నారు. 

ఇదీ చదవండి: సీక్రెట్‌గా ప్రియుడ్ని పెళ్లాడిన బిగ్‌ బాస్‌ ఫేమ్‌ : స్పెషాల్టీ ఏంటంటే


 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)