నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 15 ఇళ్లు దగ్ధం?
Published on Sat, 02/17/2024 - 09:05
ముంబైలోని గోవండిలోని బైగన్వాడి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 15 ఇళ్లకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఆ ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది.
అగ్నిమాపక దళం రాకముందే స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనలో కనీసం పది నుండి పదిహేను ఇళ్లు దెబ్బతిన్నాయని ఒక అధికారి తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరకీ ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వాహనాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేశారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
27 vehicles gutted in a fire in a parking lot at Borivali in North Mumbai | pic.twitter.com/F88nhYRSul
— MUMBAI NEWS (@Mumbaikhabar9) February 16, 2024
Tags : 1