Breaking News

ఉద్యోగిని పెర్‌ఫామెన్స్‌ బాలేదని పెయిడ్‌ లీవ్‌ : కంపెనీకి భారీ క్రేజ్‌

Published on Mon, 07/20/2026 - 15:56

పనితీరు బాగా లేని ఉద్యోగులను పన్లోంచి తీసివేయడం ఏ కంపెనీ అయినా, లేదా బాస్‌ అయినా సాధారణంగా చేసే పని. కానీ ముంబైకి చెందిన ఒక స్టార్టప్ పౌండర్‌ తీసుకున్న నిర్ణయం నెట్టింట ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఆ కంపెనీకి  ఉద్యోగ దరఖాస్తుల వరద తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆబాస్‌ ఏం చేశాడు?

'బ్లూ లాబ్‌స్టర్ మీడియా' (Blue Lobster Media) అనే కంటెంట్ ఆధారిత B2B స్టార్టప్ వ్యవస్థాపకుడు ధ్రువ్ ముఖర్జీ. తన కంపెనీలో  సరిగ్గా పని చేయలేక పోతున్న తన ఉద్యోగినికి ఎలాంటి పనిష్మెంట్‌ ఇవ్వలేదు.  పైగా  జీతంతో కూడిన సెలవు (Paid Getaway) పై పంపించాడు. దీంతో ఆయన సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

పూణే నుండి రిమోట్‌గా పనిచేస్తున్న కంటెంట్ ఆపరేషన్స్ లీడ్ ఆర్య ఫడ్నిస్ (Aarya Phadnis). ఆమె గత రెండున్నరేళ్లుగా ఈ సంస్థలో నమ్మకంగా పనిచేప్తోంది. అయితే గత నెలలో కంపెనీ కంటెంట్ ఆపరేషన్స్‌లో ఆమోదాల ఆలస్యం, నాణ్యతా లోపాలు వంటి సమస్యలను ధ్రువ్ గమనించారు. మరోవైపు తన పనితీరు తగ్గినందుకు బాధ్యత వహిస్తూ జీతం నుండి కొంత మొత్తాన్ని కోత విధించాల్సిందిగా స్వయంగా  ఆర్య ధ్రువ్‌ను కోరింది.

కానీ బాస్‌ ధ్రువ్ మాత్రం వేరుగా ఆలోచించారు. ఆమెపై చర్యలు తీసుకోవడానికి బదులుగా, ఆమెతో మాట్లాడి వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఒత్తిడికి లోనవు తున్నట్లు తెలుసుకున్నారు. ఆర్య నివసించే పూణేలోనే ఒక మంచి Airbnb లో 3 రోజుల పాటు బస ఏర్పాటు చేసి, దానికి అయ్యే ఖర్చును కంపెనీయే భరించింది (ఇందులో 2 రోజులు ప్రశాంతంగా పని చేసుకోవడానికి, 1 రోజు పూర్తి విశ్రాంతికి కేటాయించారు).ఆమె ఇంటికి దగ్గరలోనే ఒక కో-వర్కింగ్ స్పేస్‌లో డెస్క్‌ను కూడా బుక్ చేశారు.

ఇదీ చదవండి: 800 మందికి శాంసంగ్‌ ఝలక్‌ : కారణం ఇదే!

తన నిర్ణయం గురించి  మాట్లాడుతూ  "రోజు ముగిసే సమయానికి, టేబుల్‌కి అవతలి వైపు ఉన్నది కూడా ఒక మనిషే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, దానికి తగ్గట్టుగానే వారిని గౌరవించాలి. ఉద్యోగులు తప్పు చేసినప్పుడు తొలగించడం లేదా డీమోట్ చేయడం కంటే, కొన్నిసార్లు సానుభూతి (Empathy) చూపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి." అని  చెప్పడం విశేషం. 

ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

దరఖాస్తుల వెల్లువ : కంపెనీకి క్రేజ్
ధ్రువ్ ముఖర్జీ ఈ విషయాన్ని లింక్డ్‌ఇన్‌లో పంచుకోగానే  వైరల్‌గా మారింది. ఈ  కంనెనీలో మాకు ఉద్యోగం కావాలంటూ దరఖాస్తుల ఈ చిన్న స్టార్టప్ కంపెనీకి పెద్ద ఎత్తున జాబ్ అప్లికేషన్లు రావడం ప్రారంభమైనాయి. ఇందులో ఇప్పటికే ఒకరిని కంపెనీ ఉద్యోగంలోకి కూడా తీసుకుంది కూడా.

వర్క్‌ప్లేస్ టాక్సిక్ కల్చర్‌కు  భిన్నంగా ఉన్న అతని వైఖరిని నెటిజన్లు విపరీతంగా మెచ్చుకున్నారు. అటు ఆర్యకూడా  మానత్వంతో ఆయన స్పందించిన తీరుపై సంతోషం వ్యక్తం చేసింది.  ఆకంపెనీపై గౌరవం, బాధ్యత మరింత పెరిగాయని ఆమె పేర్కొంది.

ఇదీ చదవండి: 50 సార్లు ట్రై చేశా డాడీ : బీటెక్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌ ఆత్మహత్య

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)