Breaking News

తాజ్‌మహల్‌ను మైమరిపించే ఇల్లు.. ఆ మాటలకు ఫిదా కావాల్సిందే!

Published on Sat, 06/14/2025 - 16:35

పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్‌ అయినా అంటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యాసంస్థల ఓనర్‌ కమ్‌ పొలిటికల్‌ లీడర్‌ డైలాగ్‌ ఎంత ఫేమస్‌ అయ్యిందో తెలియంది కాదు. అయితే ఇక్కడో పెద్దాయన అట్లాంటి డైలాగులేవీ పేల్చడం లేదు. ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్ మహల్‌ను మోడల్‌గా తీసుకుని ఏకంగా ఇంటినే నిర్మించుకున్నారు. అందుకు ఆయన చెప్పిన సమాధానం పెద్దగా ఆశ్చర్యమేమీ అనిపించకపోవచ్చు. కానీ, ఆయన చెప్పిన విధానం మాత్రం కచ్చితంగా ఆకట్టుకుంటోంది.

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో తాజ్‌ మహల్‌ను తలపించేలా నాలుగు బెడ్‌రూమ్‌లో ఓ భవనం ఉంది. స్థానికంగా విద్యా సంస్థను నడిపించే ఆనంద్‌ ప్రకాశ్‌ చౌక్‌సీ నివాసం అది. 2021లో ఈయనగారు ఈ ఇంటితో నేషన మీడియా దృష్టిని ఆకర్షించారు. నాలుగు బెడ్‌రూమ్‌లు, ఓ కిచెన్‌, ఓ మీడియేషన్‌ రూం.. ఇందులో ఉంటాయి. ఆ ఇంటిని ఆనుకునే ఆ హైటెక్‌ గురుకుల్‌ కూడా ఉంది. తాజ్‌మహల్‌ పరిమాణంలో మూడింట ఒకటో వంతు ఉందట ఆ ఇల్లు. ఓ వ్లోగర్‌ ఆ జంటను పరిచయం చేసుకుని ఆ ఇంటిని పరిశీలించడం ఆ వీడియోలో ఉంది.

👉మా తాజ్‌ మహల్‌.. నాలుగు బెడ్‌రూమ్‌ల ఇల్లు. అసలైన తాజ్‌ మహల్‌ ప్రేమకు సమాధి. ఇదేమో నా భార్యకు ప్రేమతో కట్టించిన ఇల్లు.. అంతే తేడా

👉చిన్నతనంలో ఇంటింటికీ తిరిగి పాలు పోసేవాడిని. గర్వం తలకెక్కించుకోకు అని గుర్తు చేయడానికి గృహ ప్రవేశం సమయంలో ఈ ఇంటి మధ్యలో ఇలా గేదె బొమ్మను ఉంచాను. ఇది ఎప్పుడూ నా మూలాలను గుర్తు చేస్తుంటుంది

👉నా భార్య మెడిసిన్‌ వదిలేయాల్సి వచ్చింది. నేను ఇంజినీరింగ్‌ చేయలేకపోయాను. అందుకే పిల్లలను డాక్టర్లను, ఇంజనీర్లను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం. అలా దేశంలోనే మోస్ట్‌ హైటెక్‌ గురుకుల్‌ను నడిపిస్తున్నాం. 2200 మంది పిల్లలు. వాళ్లే మా కుటుంబం.

👉దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నింటికి పరిష్కారం ఒక్కటే.. ప్రేమ. అన్నట్లు ఆనంద్‌ ప్రకాశ్‌ చౌక్‌సీ విద్యావేత్త మాత్రమే కాదు, తరచూ దాతృత్వ కార్యక్రమాలూ నిర్వహిస్తుంటారు. మోటివేషనల్‌ స్పీకర్‌గానూ ఆయన వీడియోలు కొన్ని అక్కడ వైరల్‌ అవుతుంటాయి.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)