Breaking News

‘పహల్గామ్’కు‌ నెల.. ముష్కరుల వేటలో ఎన్‌ఐఏ

Published on Thu, 05/22/2025 - 09:23

పహల్గామ్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌(Pahalgam)లో ఏప్రిల్ 22న 25 మంది పర్యాటకులను, ఒక స్థానికుడిని హతమార్చిన ఉగ్రవాదుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ముమ్మరంగా గాలిస్తోంది. ఈ దాడి జరిగి నేటికి (మే 22)కు నెలరోజులయ్యింది. ఈ ఘటన భారత్‌ - పాకిస్తాన్ మధ్య శత్రుత్వాన్ని మరింతగా పెంచింది.

ఈ దాడి జరిగిన దరిమిలా జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి ఫిర్యాదు అందుకున్న ఎన్‌ఐఏ ప్రస్తుతం సాక్షులను విచారిస్తోంది. అలాగే అందుబాటులో ఉన్న డేటాను పరిశీలిస్తోందని సమాచారం. ఈ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదుల హస్తం ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపధ్యంలో సంబంధిత అధికారులు ముగ్గురు ఉగ్రవాదుల(terrorists) స్కెచ్‌లను విడుదల చేశారు. వారి గురించిన సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షల రివార్డును ప్రకటించారు. మరోవైపు ఎన్‌ఐఏ అధికారులు ఇప్పటివరకూ ఫోన్‌ ఆపరేటర్లు, దుకాణదారులు, ఫోటోగ్రాఫర్లు, సాహస క్రీడలలో పనిచేసేవారితో సహా 150 మంది స్థానికులను విచారించారని  ఒక అధికారి తెలిపారు.

ఈ ఘటనకు 15 రోజుల ముందు ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా దుకాణాన్ని మూసివేసిన దుకాణదారుడిని కూడా ఎన్‌ఐఏ విచారించింది. ​కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ డంప్ డేటాను సేకరించింది. వీటిలో అధికంగా బాధితుల కుటుంబ సభ్యులు, పర్యాటకులు తీసిన వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. ఇవి దాడి చేసినవారు ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్లిపోయారో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని ఒక అధికారి తెలిపారు. 2019 పుల్వామా దాడి(Pulwama attack) దర్యాప్తు సమయంలో ఎన్‌ఐఏ త్రీడీ మ్యాపింగ్‌ను తయారు చేసింది. ఇప్పుడు కూడా అదే తరహా మ్యాపింగ్‌తో దర్యాప్తు సాగిస్తోందని సమాచారం. మరోవైపు జమ్ముకశ్మీర్‌ పోలీసులు భారీ స్థాయిలో దాడులు నిర్వహించి, వందలాది మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీని గురించి పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ రెండు రోజుల పాటు దాడులు నిర్వహించి, పలువురిని అదుపులోనికి తీసుకుని విచారించామన్నారు.  వారిలో చాలా మందిని విడుదల చేశామని కూడా తెలిపారు. కాగా దాడి జరిగిన దరిమిలా భద్రతా సంస్థలు..  ఈ ఘాతుకానికి పాల్పడిన ముష్కరుల పాదముద్రలను గుర్తించగలిగాయని ఒక అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: ప్రమాదం బారిన జీవవైవిధ్యం 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)