Breaking News

మోనాలిసా దంపతులకు ఊరట

Published on Wed, 06/03/2026 - 13:56

కొచ్చి: కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మోనాలిసా భోస్లేకు, ఆమె భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్‌కు ఊరట లభించింది. వాళ్లను అరెస్ట్‌ చేయొద్దని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కేరళ హైకోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మోనాలిసా మైనర్‌ అని, ఆమెను కిడ్నాప్ చేశారనే ఆరోపణలు.. అలాగే ఈ వివాహం చట్టబద్ధం కాదనే మధ్యప్రదేశ్‌ పోలీసుల అభ్యంతరాల నేపథ్యంలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ అభియోగాలను తోసిపుచ్చుతూ అరెస్ట్‌ నుంచి రక్షణ కోరుతూ మోనాలిసా, ఫర్మాన్‌ కేరళ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. నెలరోజుల పాటు ఫర్మాన్ ఖాన్‌ను అరెస్ట్ చేయొద్దని మద్యప్రదేశ్‌ పోలీసులను ఆదేశించింది. ఈలోగా.. అక్కడి కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవాలని ఈ జంటకు కోర్టు సూచించింది. 

2025 కుంభమేళా సందర్భంగా పూసలు విక్రయిస్తూ వైరల్‌ అయిన మోనాలిసా భోస్తే Monalisa Bhosle ఈ ఏడాది ప్రారంభంలో కేరళలో మహమ్మద్‌ ఫర్మాన్‌ ఖాన్‌ను వివాహం చేసుకుంది. మతాంతర వివాహం కావడంతో ఈ వ్యహారం పెను దుమారం రేపింది. 

అయితే మోనాలిసా వివాహం సమయంలో కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఉన్నారని ఆరోపణలు రావడంతో వివాహ చట్టబద్ధతపై వివాదం చెలరేగింది. దీంతో పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది. ఇక మోనాలిసా తండ్రి పోలీసులకు కిడ్నాప్ ఫిర్యాదు చేయడంతో ఫర్మాన్ ఖాన్‌పై కేసు నమోదైంది. తాము ఎలాంటి అక్రమానికి పాల్పడలేదని, మోనాలిసా మైనర్ కాదని దంపతులు కోర్టులో వాదించారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు, మోనాలిసా వయస్సుకు సంబంధించిన పత్రాల్లో ఫోర్జరీ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె జననం 2009 డిసెంబర్‌లో జరిగిందని, దంపతులు చెబుతున్నట్లుగా 2008 జనవరిలో కాదని వాదించారు. అయితే ఈ ఆరోపణలను మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తరఫు న్యాయవాదులు ఖండించారు. 

ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్.. ఒక నెలపాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి: కేరళలో ఉండడం మీ అదృష్టం!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)