లైంగికదాడి వీడియో: దొరికిన కామ పిశాచాలు

Published on Fri, 05/28/2021 - 09:15

బెంగళూరు: సంచలనం సృష్టించిన లైంగిక దాడి వైరల్​ వీడియోలో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులోని ప్రధాన నిందితులు ఎట్టకేలకు గుర్తించగలిగారు. ఈ వీడియోకు సంబంధించి  ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్​ చేశారు. ఓ యువతి బట్టలు చించేసి అఘాయిత్యానికి పాల్పడిన వీడియో ఒకటి బుధ, గురు వారాల్లో ఇంటర్నెట్​లో వైరల్​​ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనపై కేఎస్​యూ ఢిల్లీ విభాగం హోం మంత్రి అమిత్​ షాకు ఒక లేఖ రాసింది. ఆ వెంటనే కేంద్ర మంత్రి కిరెన్​ రిజ్జు, ఐపీఎస్​ అధికారి రాబిన్​ హిబు, మేఘాలయా ఎమ్మెల్యే అంపరీన్​ రంగంలోకి దిగారు. దీంతో 24 గంటలు గడవకముందే నిందితులను అరెస్ట్ చేయడం విశేషం. 

చదండి: బట్టలు చించేసి, ఏడుస్తున్నా వినకుండా..

ఫేస్​బుక్​ ప్రొఫైల్​తో?
మొదట అది 25 ఏళ్ల నాగాలాండ్​ మహిళ వీడియో అని, ఆ అవమానం తట్టుకోలేక ఆమె సూసైడ్​ చేసుకుందనే ప్రచారం జరిగింది. ట్విట్టర్​లో బాధితురాలిగా న్యాయం జరగాలని క్యాంపెయిన్​ జరిగింది. అయితే అది ఆమె వీడియో కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అధికారులు.  వీడియో, అందులోని విజువల్స్​ ఆధారంగా ఫొటోలు రిలీజ్ చేసిన అస్సాం పోలీసులు.. నిందితుల ఆచూకీ చెప్పిన వాళ్లకు నజరానా ప్రకటిస్తూ ఫేస్​బుక్​లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆపై ఆ వీడియోలోని నిందితులను రామమూర్తి నగర్ పోలీసులు అరెస్ట్​ చేశారు. అయితే నిందితుల్లో ఒకరి ఫేస్​బుక్ ఫ్రొఫైల్ ఆధారంగా ట్రేస్​ చేసి పట్టుకోగలిగామని రామమూర్తి నగర్​ స్టేషన్​ అధికారి ఒకరు వెల్లడించారు.ఈ అమానుష ఘటనలో మొత్తం ఆరుగురు ఉన్నారని, లైంగిక దాడి కేసులో వాళ్లను అరెస్ట్ చేశామని, అందులో ఇద్దరు మహిళలు ఉన్నారని ఆయన తెలిపారు. బాధితురాలి వయసు 22 సంవత్సరాలని, ఎన్​ఆర్​ఐ కాలనీలో వారం క్రితం ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారని తెలుస్తోంది. అయితే నిందితుల గాయాల గురించి అప్​డేట్​ అందింది. సీన్​ రీకన్​స్ట్రక్షన్​ కోసం తీసుకెళ్తున్న క్రమంలో ఇద్దరు పారిపోయే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలో కాల్పులు జరపడంతోనే గాయాలయ్యాయని తెలుస్తోంది. 


అక్రమంగా వచ్చారు
కాగా, ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బాధితురాలితో సహా నిందితులంతా బంగ్లాదేశ్​కు చెందిన వాళ్లని పోలీసులు వెల్లడించారు. వాళ్లంతా అక్రమంగా చొరబడి ఇక్కడికొచ్చి స్థిరపడ్డారని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. అయితే వాళ్లంతా వ్యభిచారం చేస్తున్నారని, వ్యక్తిగత కారణాలతోనే బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఇండిపెండెంట్​ జర్నలిస్ట్ ప్రతిభా రామన్​ తన ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. ​ఇక నిందితులతో పాటు బాధితురాల్ని ఐడెంటిటీని బంగ్లాదేశ్​ ధృవీకరించింది. బాధితురాలు మోఘ్​బజార్​(ఢాకా) నివాసి అని, సౌదీకి వెళ్లాలని ఏర్పాట్లు చేసుకున్న ఆ అమ్మాయి మూడు నెలల నుంచి జాడ లేకుండా పోయిందని తేజ్​గావ్​ డీసీపీ సహీదుల్లా వెల్లడించారు. ఇక నిందితుల్లో ఒకడు టిక్​టాక్​లో ​ ‘హ్రిదోయ్​ బాబు’గా బంగ్లాదేశ్​లో పాపులర్​ అని తెలుస్తోంది.

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

భద్రాచలం : కన్నుల పండువగా శ్రీ సీతారాముల తెప్పోత్సవం (ఫొటోలు)

+5

ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి (ఫొటోలు)

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)