Breaking News

ఆరు నెలల క్రితం అదృశ్యం! చివరికి అస్థిపంజరంగా ఆచూకీ లభ్యం

Published on Sat, 02/04/2023 - 09:03

సాక్షి, బనశంకరి:  ఆరు నెలల క్రితం అదృశ్యమైన నేపాలీ మహిళ నిర్జీన ప్రాంతంలో అస్థిపంజరంగా కనిపించింది. హుళిమావు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అక్షయనగర అపార్టుమెంట్‌ వెనుకభాగంలో పొదల మధ్య చెట్టుకు వేలాడుతున్న స్థితిలో ఉన్న అస్థి పంజరం నేపాలీకి చెందిన పుష్పదామి (22)గా పోలీసులు గుర్తించారు.  

భర్తతో గొడవ పడి...  
నేపాల్‌కు చెందిన పుష్పాదామి, భర్త అమర్‌దామి అక్షయనగరలో నివాసం ఉంటున్నారు. భర్త మద్యానికి బానిస. దీంతో అతన్ని భరించలేక నేపాల్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. గత ఏడాది జులై 8న భర్తపై కోపంతో ఇంటి నుంచి పుష్పదామి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భార్య కనిపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై ఆగ్నేయ విభాగ డీసీపీ సీకే.బాబా శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... ఉరి వేసుకున్న స్థితిలో గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో  హుళిమావు పరిధిలోని అపార్టుమెంట్‌ వెనుక భాగంలోని పొదల్లో మనిషి తలపుర్రె,అస్థి పంజరం లభ్యమైంది. అస్థిపంజరం పైన  పాదరక్షలు, మెడలో ఉన్న నెక్లెస్, ఇతర వస్తువులు అక్కడ పక్కనే లభించాయి. అక్కడ ఎక్కువగా సంచారం లేకపోవడం నిర్జీన ప్రదేశం కావడంతో ఆ వస్తువులు ఎవరూ తీసుకోలేదు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందని సీకే బాబా తెలిపారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.    

(చదవండి: మొబైల్‌ చూడొద్దని మందలించారని...)

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)