Breaking News

యుద్ధ సంక్షోభం : వంట నూనెలు భగ్గు!

Published on Wed, 03/04/2026 - 17:55

ఇరాన్‌పై  అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు ఆందోళన చెందుతున్నట్టుగా నిత్యావసర ధరలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.  పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం పూణేలో  నిత్యాసవరాలు ధరలు ఆకాశం వైపు చూస్తున్నాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే రవాణా ఖర్చులు పెరిగి, అన్ని రాష్ట్రాల్లోనూ నూనె ధరలు మరో 10-15శాతం పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

యుద్ధ వాతావరణం నేపథ్యంలోని పూణేలోని సామాన్యులవంటగదిపై ప్రభావం చూపుతోంది. వంట నూనెలు, పప్పుధాన్యాలు , డ్రై ఫ్రూట్స్ ధరలు పెరిగిపోయాయి.  హోల్ సేల్ మార్కెట్‌లో లీటరుకు  రూ. 3-4 వరకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల సోయాబీన్, పామాయిల్ వంటి వాటిని బయోడీజిల్ తయారీకి మళ్లిస్తున్నారు. దీనివల్ల ఆహార అవసరాలకు నూనెల కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి.

డ్రై ఫ్రూట్స్: ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి రావాల్సిన షిప్‌మెంట్‌లు ఆగిపోవడంతో ఖర్జూరం ధరలు 10-20శాతం పెరిగాయి. బాదం, పిస్తా ధరలు కూడా 5-8శాతం వరకు పెరిగాయి. 

ఇదీ చదవండి: మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్‌ డీల్‌ హాట్‌ టాపిక్‌

ఇతర రాష్ట్రాల పరిస్థితి
ప్రస్తుతం భారతదేశం వంట నూనెల అవసరాలలో సుమారు 60 శాతం  దిగుమతులపైనే ఆధారపడుతోంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ మార్పులు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  కూడా పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు లీటరుకు 5 - 10 వరకు పెరిగాయి. పండుగల సీజన్ దగ్గర పడుతుండటంతో డిమాండ్ పెరిగి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. వేరుశనగ నూనెకు ప్రధాన కేంద్రమైన గుజరాత్‌లో ఎగుమతులు ప్రభావితమై దేశీయంగా ధరల్లో కొంత అస్థిరత కనిపిస్తోంది. సోయాబీన్ , ఆవనూనె ఎక్కువగా పండే  మధ్యప్రదేశ్ , రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా స్థానిక మార్కెట్లలో ధరలు స్వల్పంగా పెరిగాయి.

ఇదీ చదవండి: దేశంలో చమురు నిల్వల పరిస్థితి ఏంటి? ఎల్‌పీజీ దొరుకుతుందా?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)