Breaking News

ఢిల్లీలో ఊహించని విషాదం.. సీసీటీవీ దృశ్యాలు

Published on Thu, 08/14/2025 - 19:54

ఢిల్లీ: నగరంలో ఊహించని విషాదం జరిగింది. కల్కాజీ ప్రాంతంలో తండ్రి, కూతురు బైక్‌పై వెళ్తుండగా భారీ వర్షానికి బైక్‌పై చెట్టు కూలిపోయింది. తండ్రి మృతి చెందగా.. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. సుధీర్ కుమార్ (50) అనే వ్యక్తి తన కుమార్తె ప్రియ (22)తో కలిసి వెళ్తుండగా.. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీలో ఒక పాత వేప చెట్టు విరిగి బైకర్, పక్కనే ఉన్న వాహనాలపై పడింది. ఈ ఘటన ఉదయం  9:50 గంటలకు జరిగింది. సీసీటీవీలో ఈ విషాద ఘటన రికార్డయ్యింది.

చెట్టు కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. పీసీఆర్‌ కాల్‌కు పోలీసులు వేగంగా స్పందించి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇద్దరు బాధితులను బయటకు తీసి, సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రామా సర్వీసెస్ (CATS) అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.

తండ్రి, కుమార్తె ఇద్దరినీ AIIMS ట్రామా సెంటర్‌లో చేర్చారు. తండ్రి తీవ్ర గాయాలతో మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో తెల్లవారుజామున నుండి కుండపోత వర్షం కురుస్తోంది.  భారీ వర్షాలు ప్రభావంతో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఏర్పడింది. జనజీవనానికి అంతరాయం కలిగింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)