Breaking News

ఢిల్లీ ఘటన: కారులో ‘ముసుగు మనిషి’

Published on Tue, 11/11/2025 - 08:16

న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలో జరిగిన పేలుడుపై దర్యాప్తు ముమ్మరం అయ్యింది. ఈ నేపధ్యంలో పలు  ఆధారాలు బయటపడుతున్నాయి. పేలుడు సంభవించడానికి కొన్ని నిమిషాల ముందు ముసుగు ధరించిన ఒక వ్యక్తి హ్యుందాయ్ ఐ 20 కారును నడుపుతున్నట్లు కనిపిస్తున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. పార్కింగ్ స్థలం  దగ్గరి దృశ్యాలలో ఇది ఒకటి. నల్లటి ముసుగు ధరించిన వ్యక్తి HR26CE7674 నంబర్ ప్లేట్‌ కలిగిన హ్యుందాయ్ ఐ20 కారును నడుపుతున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది.

సోమవారం సాయంత్రం 6:52 గంటల ప్రాంతంలో ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడులో  తొమ్మిది మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడి కారు పార్కింగ్ స్థలంలోనికి ప్రవేశించడం, బయటకు వెళ్లడం చూపించే సీసీటీవీ ఫుటేజ్‌లు పోలీసులకు లభ్యమయ్యాయి. ఆ సమయంలో నిందితుడు ఒంటరిగా ఉన్నాడని గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఆ వాహనం కదలికలను నిర్ధారించడానికి అక్కడికి సమీపంలోని టోల్ ప్లాజాల ఫుటేజ్‌లతో సహా 100 కి పైగా సీసీటీవీ క్లిప్‌లను అధికారులు పరిశీలిస్తున్నారని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.

అధిక తీవ్రత కలిగిన పేలుడుకు ముందు హ్యుందాయ్ కారు ప్రయాణాన్ని ట్రాక్ చేయడానికి  సీసీటీవీ క్లిప్ దర్యాప్తు అధికారులకు సహాయపడింది. ఈ వాహనం దర్యాగంజ్ మార్కెట్ ప్రాంతం గుండా సునేహ్రీ మసీదు సమీపంలోనికి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో, పేలుడుకు దాదాపు మూడు గంటల ముందు చేరుకుంది. వాహనం యూ టర్న్ తీసుకొని లోయర్ సుబాష్ మార్గ్ వైపు వెళుతుండగా, కారు సిగ్నల్ వద్దకు వస్తోందని, పేలుడు సంభవించినప్పుడు వేగం తగ్గిందని సీసీటీవీ ఫుటేజ్‌లో తెలుస్తున్నదని ఒక అధికారి పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం నేతాజీ సుబాష్ మార్గ్‌లో లాల్ కిలా మెట్రో స్టేషన్‌కు సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్  దగ్గర జరిగిన పేలుడు హ్యుందాయ్ ఐ20 కారును ఛిన్నాభిన్నం చేసింది.ఈ ఘటనలో  తొమ్మిదిమంది మరణించగా 20 మందికి పైగా జనం గాయాలపాలయ్యారు.  ఇది దేశవ్యాప్తంగా భయాందోళనలకు దారితీసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ), పేలుడు పదార్థాల చట్టం తదితర కఠినమైన చట్టాల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పేలుడుకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం మంగళవారం తెల్లవారుజామున పేలుడు జరిగిన ప్రదేశం నుండి నమూనాలను సేకరించిందని ‘హిందుస్తాన్‌ టైమ్స్‌’ పేర్కొంది.

ఇది కూడా చదవండి: ఢిల్లీ ఘటన: ‘అమెరికా’ హెచ్చరిక 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)