Breaking News

Delhi Blast: దర్యాప్తులో వేగం.. పరిహారంలో లేదా?

Published on Mon, 12/29/2025 - 11:16

న్యూఢిల్లీ: దేశ రాజధాని డిల్లీలో ఇటీవల జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు,  గాయపడిన బాధితులకు ప్రభుత్వం ఇంకా పరిహారం అందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి నెల రోజులు గడుస్తున్నా, తమ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నవంబర్ 10న జరిగిన ఈ పేలుడులో 15 మంది మరణించగా, 20 మందికి పైగా జనం గాయపడ్డారు.

ఈ ఘటన జరిగిన  అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ. ఐదు లక్షలు,  తీవ్రంగా గాయపడిన వారికి రూ. రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అయితే ఈ సాయం అందించడంతో  తీవ్ర జాప్యం జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, తాము అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు అధికారుల నుండి ఎటువంటి స్పందన రాలేదంటున్నారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. తమ కుటుంబానికి గల ఏకైక ఆధారం కోల్పోయామని, ఇప్పటికీ పరిహారం అందకపోవడంతో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు రోదిస్తున్నారు. దీనిపై ‘ది హిందూ’ ఢిల్లీ ప్రభుత్వ వర్గాలను సంప్రదించగా, పత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని,  త్వరలోనే అర్హులైన వారందరికీ పరిహారం చెల్లిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ముమ్మరంగా విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ  కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇది  కూడా చదవండి: ‘మహా’ రాజకీయాలు.. పవార్‌ ఇకపై ‘పరివార్‌’

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)