Breaking News

కేంద్రానికి మద్దతు నిలిచిన మన్మోహన్ సింగ్‌

Published on Fri, 09/08/2023 - 17:11

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ మద్దతుగా నిలిచారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై భారత్ అవలంభించిన విధానం సరైనదేనని అన్నారు. భారత్‌ తన సార్వభౌమాధికారాన్ని, ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిందని కొనియాడారు. అదే క్రమంలో ప్రపంచ శాంతికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. జీ-20 సమావేశాలకు ఆహ్వానాలు అందిన వారిలో మన్మోహన్ సింగ్‌ కూడా ఒకరు. ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు సమాధానమిచ్చారు. 

విదేశాంగ విధానం దేశీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు మన్మోహన్ సింగ్ తెలిపారు. దౌత్య సంబంధాలను రాజకీయాల కోసం వాడుకోవడంలో సమన్వయం పాటించాలని కోరారు. జీ20కి ఇండియా ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారత్ పాత్రకు మద్ధతుగా నిలిచారు. సరైన పనే చేసిందని అన్నారు.

జీ20 సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాకపోవడం, చైనా-భారత్ సంబంధాలపై ఆయన స్పందించారు. దేశ సార్యభౌమాధికారాన్ని కాపాడటంలో ప్రధాని మోదీ ప్రభుత్వం కావాల్సినన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. క్లిష్టమైన దౌత్య వ్యవహారాలను ఎలా నిర్వహించాలో ప్రధానమంత్రికి సలహా ఇవ్వడం సరికాదని చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకపోవడం దురదృష్టకరమని అన్నారు. 

స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా దేశంలో ఉన్న సవాళ్లపై ప్రశ్నించినప్పుడు.. తాను ఆశావాదంతో ఉన్నట్లు చెప్పారు. దేశంలో అభివృద్ధికి ఆశావాద స్వభావమే నాంది అని అన్నారు. చంద్రయాన్ 3 విజయంపై కూడా ఆయన స్పందించారు. ఇస్రో సాధించిన విజయంపై ఆయన అభినందనలు తెలిపారు. ప్రపంచంలో భారత్ మరింత ముందుకు వెళుతోందని అన్నారు.          

ఇదీ చదవండి: ఢిల్లీకి చేరిన ఐఎంఎఫ్‌ చీఫ్‌.. ఫోక్ సాంగ్‌కు డ్యాన్సులు..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)