Breaking News

నీట్‌లో 720/720.. ధోనీతో లింక్‌.. ‘మానవ్‌’ సక్సెస్‌ స్టోరీ

Published on Sat, 02/22/2025 - 13:26

నీట్‌ సక్సెస్ స్టోరీస్‌ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. మానవ్‌ ‍ప్రియదర్శి నీట్‌లో సాధించిన విజయం అందరికీ స్ఫూర్తినిస్తుంది. జార్ఖండ్‌కు చెందిన మానవ్‌ ‍ప్రియదర్శి(Manav Priyadarshi) కుటుంబాన్ని డాక్టర్ల ఫ్యామిలీ అని అంటారు. ఇప్పటికే ముగ్గురు డాక్టర్లున్న ఈ ఫ్యామిలీలో ఇప్పుడు మానవ్‌ ప్రియదర్శి తన ఎంబీబీఎస్‌ పూర్తిచేశాక నాల్గవ డాక్టర్‌ కానున్నాడు.

చిన్నప్పటి చదువులో ఎంతో చురుకైన మానవ్‌ ప్రియదర్శి నీట్‌(NEET) యూజీలో మొదటి ప్రయత్నంలోనే 720 మార్కులకు 720 మార్కులు తెచ్చుకోవడం విశేషం. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఉంటున్న మానవ్‌ 2024లో జరిగిన నీట్‌ యూజీ పరీక్షలో జార్ఖండ్‌లో టాపర్‌గా నిలిచాడు. ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 57 తెచ్చుకుని, టాప్‌ 100 నీట్‌ టాపర్స్‌లో ఒకనిగా నిలిచాడు. నాడు మీడియాతో మానవ్‌ ప్రియదర్శి మాట్లాడుతూ తనకు టాపర్‌గా నిలుస్తాననే నమ్మకం ఉందని, కానీ స్టేట్‌ నంబర్‌ వన్‌గా నిలుస్తానని అనుకోలేదన్నారు.

మానవ్‌ ప్రియదర్శికి ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీకి(Dhoni) మధ్య ఒక సంబంధం ఉంది. రాంచీలో జేవీఎం శ్యామలీ స్కూలుకు మంచి  పేరు ఉంది. ఇదే స్కూలులో ఎంఎస్‌ ధోనీ చదువుకున్నాడు. ఇప్పుడు ఇదే స్కూలు నుంచి మానవ్‌ 12వ తరగతి పూర్తి చేశాడు. తాను సాధించిన విజయానికి తన పాఠశాల ఉపాధ్యాయులే కారణమని మానవ్‌ చెప్పుకొచ్చాడు. మానవ్‌ ప్రియదర్శి నీట్‌ యూజీ పరీక్షలో 99.9946856 పర్సంటేజీ తెచ్చుకున్నాడు.

మానవ్‌ ప్రియదర్శి తండ్రి సుధీర్‌ కుమార్‌ రిటైర్డ్‌ ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌(Physics professor). మానవ్‌ పెద్దక్క డాక్టర్‌ నిమిషా ప్రియ భాగల్‌పూర్‌ మెడికల్‌ కాలేజీలో డాక్టర్‌. మానవ్‌ చిన్నాన్న డాక్టర్‌ ప్రిన్స్‌ చంద్రశేఖర్‌ సహరసాలో మెడికల్‌ ఆఫీసర్‌.  మానస్‌ మామ డాక్టర్‌ రాజీవ్‌ రంజన్‌ రాంచీ ప్రభుత ఆస్పత్రి వైద్యులు. మానవ్‌ మీడియాతో మాట్లాడుతూ విజయానికి దగ్గరి దారులుండవని, లక్ష్యాన్ని నిర్థారించుకుని, పట్టుదలతో చదివితే ఓటమి ఎదురు కాదన్నాడు. 

ఇది కూడా చదవండి: బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ..
 

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు