Breaking News

ఏఐ గ్లాసులతో అనంత పద్మనాభస్వామి ఆలయంలోకి.. తరువాత ఏమైందంటే

Published on Mon, 12/22/2025 - 21:22

తిరువనంతపురం: కేరళ తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంలోకి సింగపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఏఐ సాంకేతికత కలిగిన గ్లాసులు ధరించి వచ్చారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతనిని అరెస్టు చేశారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా సాంకేతికత కలిగిన కలిగిన వస్తువులతో ఆలయంలోకి వచ్చినందుకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు శేషనాగుపై పడుకున్నరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి అధికారులు ఐదెంచెల భద్రత కల్పిస్తారు. డ్రోన్, స్మార్ట్ సెన్సార్లు వంటి ఆధునాతన పరికారలతో నిరంతంరం నిఘా నేత్రాలలో ఉంచుతారు. అయితే ఆలయంలోకి మెుబైల్స్, కెమెరాలు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతులు లేవు.

ఈ నేపథ్యంలోనే ఏఐ మెటా సాంకేతికత కలిగిన గ్లాసులను ధరించి వచ్చిన విదేశీ భక్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆలయ నిబంధనలు తెలియక తాను గ్లాసులు ధరించానని ఆ భక్తుడు తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం అతనిని కోర్టులో హాజరు కావాల్సిందిగా చెప్పి వదిలి వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరస్టైన వ్యక్తి  పేరు తిరుపనీన్ అని ప్రస్తుతం ఆయన శ్రీలంక సంతతికి చెందిన వ్యక్తి కాగా ప్రస్తుతం సింగపూర్‌లో నివాసం ఉంటున్నారని తెలిపారు.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)