Breaking News

భార్య, పెళ్లికెదిగిన ముగ్గురు కుమార్తెల హత్య, స్థానికంగా కలకలం

Published on Fri, 09/11/2026 - 15:41

రాజస్థాన్‌లోని జైపూర్ పరిధిలోని గోవింద్ పురాలో భార్యాబిడ్డల్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న భార్య, ముగ్గురు కుమార్తెలను హత్య చేసి అక్కడి నుంచి ఉడాయించాడో వ్యక్తి. ఈ అమానుషం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరడంతో  ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం  ఈ దాడిలో 40 ఏళ్ల గీతా ఝా, ఆమె ముగ్గురు కుమార్తెలు నందిని, గిరీష, రాధిక (17-23 ఏళ్లు) మృతి చెందారు. మృతురాలి భర్త, పిల్లల తండ్రి  రాహుల్ ఝాగా నిందితుడిగా గుర్తించారు. కుటుంబంలో చెలరేగిన తీవ్రమైన వివాదాలే ఈ దారుణ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

 హత్యల అనంతరం ఏమీ ఏరగనట్టుగా పాలవాడి దగ్గర పాలుతీసుకొని, తండ్రికి టీ పెట్టి వచ్చి,  ఆ తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. రాహుల్ ఝా షేర్ ట్రేడింగ్ చేసేవాడు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే ఆయన గుజరాత్ నుండి జైపూర్‌కు తిరిగి వచ్చారు. భార్య గీతా ఝా తమ ఇంటి మొదటి అంతస్తులో ఒక బొటిక్‌ను నడిపేవారు. వారి పెద్ద కుమార్తె నందిని చదువుకుంటూనే ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు.ఈ హత్యలకు కేవలం మూడు రోజుల ముందు రాహుల్ ఒక పొరుగింటి వ్యక్తి వద్ద రూ. 25,000 అప్పు తీసుకున్నట్లు  తెలుస్తోంది.
 

ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్‌ చేద్దామని, ఏఐతో ఏకంగా..!

వెలుగులోకి వచ్చిందిలా
శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి వద్ద ఎలాంటి కదలికలు లేకపోవడంతో పొరుగువారు, బంధువులకు అనుమానం వచ్చి చూడటంతో ఈ ఘోరం బయటపడింది. మరోవైపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి నిందితుడి 85 ఏళ్ల తండ్రి ఇంట్లోనే ఉన్నారు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ (FSL) బృందాలు, డాగ్ స్క్వాడ్ ప్రదేశాన్ని పరిశీలించి రక్త నమూనాలు, ఆధారాలను సేకరించాయి. దాడికి ఉపయోగించిన ఇటుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసిపి (వెస్ట్) ప్రశాంత్ కిరణ్ ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నగర సరిహద్దుల్లో తనిఖీలు తీవ్రతరం చేసి, రాహుల్ ఝా ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

ఇదీ చదవండి: రూ. 100 కోట్ల బ్లాక్‌ బ్లస్టర్‌ : వారికి లగ్జరీ కార్లు, వామికాకు మొండి చేయి?

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)