Breaking News

చచ్చిపోయాడనుకుంటే..30 ఏళ్లకు తిరిగొచ్చాడు!

Published on Wed, 12/31/2025 - 18:17

ఉత్తరప్రదేశ్‌లోని,ముజఫర్‌నగర్‌లో అద్భుత సంఘటన జరిగింది. 30 ఏళ్ల క్రితం చని పోయాడని భావిస్తున్న వ్యక్తి ఊహించని విధంగా  కళ్ల ముందు కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. తొలుత అస్సలు నమ్మలేదు.ఈ తరువాత కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

ఖతౌలి పట్టణంలోని మొహల్లా బల్కారాం నివాసి షరీఫ్ 28 ఏళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు. బంధువులకు అందుబాటులో లేకుండా పొయ్యాడు. అయితే పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో షరీఫ్ అధికారిక పత్రాలకోసం 1997 తరువాత తొలిసారి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అకస్మాత్తుగా వృద్ధుడైన  షరీఫ్‌  ప్రత్యక్షం కావడంతో బంధువులు, పొరుగు వారు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం షరీఫ్ మొదటి భార్య 1997లో మరణించింది. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుని భార్యతో పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాడు. ప్రారంభంలో ల్యాండ్‌లైన్ ఫోన్ కాల్స్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండేవాడు. అయితే, కాలక్రమేణా అవీ ఆగిపోయాయి. అతను ఇచ్చిన అడ్రస్‌లో షరీఫ్‌ను సంప్రదించాలని ప్రయత్నించిన బంధువులకు నిరాశే ఎదునైంది.  దీంతో అతను చనిపోయాడని భావించారు. అయితే ఎస్‌ఐఆర్‌ పుణ్యమా అని రెండు రోజుల క్రితం షరీఫ్ ఖతౌలికి తిరిగి వచ్చాడు. తొలుత ఎవరూ నమ్మలేదు.  షరీఫ్ తిరిగి వచ్చాడన్న సమాచారంతో స్థానికంగా సందడి నెలకొంది. ఇరుగు పొరుగువారు, బంధువులు, పరిచయస్తుంతా గుమిగూడారు, దూరపు చుట్టాలు వీడియో కాల్స్ చేసి మురిసి పోయారు.

ఇదీ చదవండి: లిఫ్ట్‌ ఇస్తామని, వ్యాన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం

గత 15, 20  ఏళ్లుగా అతని కోసం ఎంత వెదికినా ఫలితంలేదని మేనల్లుడు మొహమ్మద్ అక్లిమ్ తెలిపారు. అయితే రెండో పెళ్లి తరువాత ఆర్థిక పరిస్థితి, కమ్యూనికేషన్ సదుపాయం లేక పోవడం వల్ల తన కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని షరీఫ్ చెప్పుకొచ్చాడు. ఇపుడు ప్రభుత్వ పత్రాలు అవసరం కాబట్టి తిరిగి వచ్చానని, ఆ తర్వాత తిరిగి వెళ్లిపోతానని కూడా చెప్పాడు. అన్నట్టుగానే సంబంధిత పత్రాలను తీసుకొని బెంగాల్‌కు వెళ్లిపోయాడు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)