Breaking News

లిఫ్ట్‌లో షాకింగ్‌ యాక్సిడెంట్‌.. ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!

Published on Wed, 03/04/2026 - 15:09

గుజరాత్‌లోని వల్సాద్‌లో అత్యంత భయానకమైన లిఫ్ట్‌ ప్రమాదంఆందోళన రేపింది. లిఫ్ట్‌లోంచి బయటకు వస్తూండగానే అమాంతం లిఫ్ట్‌ కిందికి కదిలి పోయింది. హైటెక్ లిఫ్ట్‌తో కూడిన 14 అంతస్తుల భవనంలో జరిగిన ఈ ఘటన తీవ్ర దిగ్బ్రాంతి రేపింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌గా మారింది. గుజరాత్‌లో చాలా భవనాల్లో లిఫ్ట్‌లు శిథిలావస్థలో ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

వల్సాద్ నగరంలోని తితాల్ రోడ్‌లోని సర్దార్ హైట్స్‌లోని విలాసవంతమైన సబర్మతి భవనంలో ఈ సంఘటన జరిగింది.  లిఫ్ట్‌లో ఉన్న ఒకవ్యక్తి తాను దిగాల్సిన ఫ్లోర్‌కు సంబంధించిన అంతస్తు కోసం బటన్‌ నొక్కాడు.  లిఫ్ట్ కావలసిన అంతస్తుకు చేరుకుంది. లిఫ్ట్‌ డోర్‌ తెరుచుకోవడంతోనే అతడు బయటకు అడుగు పెడుతుండగాఅకస్మాత్తుగా అధిక వేగంతో  లిఫ్ట్  కిందికి వెళ్లిపోయింది. అయితే ఈ  ఘటననుంచి  అతను ప్రాణాలతో తృటిలో తప్పించుకోవడం విశేషం. లిఫ్ట్ లోపల ఏర్పాటు చేసిన CCTV కెమెరాలలో ఈ దిగ్భ్రాంతికరమైన క్షణాలు స్పష్టంగా రికార్డైనాయి.

ఇదీ చదవండి: మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్‌ డీల్‌ హాట్‌ టాపిక్‌

సాంకేతిక లోపమే కారణమా?
టెక్నికల్‌  లోపం కారణంగానే ఇలా  తలుపు తెరిచి ఉండగానే  లిఫ్ట్ కదిలి  ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు . ఈ లిఫ్ట్‌ను ఒక ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తుందని, లిఫ్ట్ సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సాంకేతిక నిపుణులు రెండు రోజుల ముందే భవనాన్ని సందర్శించారని భవనం ఛైర్మన్ మీడియాకు తెలిపారు.

ఇదీ చదవండి: సంగీత్‌ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్‌, 82 లక్షల మంది ఫిదా!


 

 

లిఫ్ట్ ప్రమాదాలు జరగకుండా, లిఫ్ట్‌లో ఇరుక్కుపోయినప్పుడు ప్రాణాపాయం కలగకుండా  తీసుకోవాల్సిన జాగ్రత్తలు  

  • లిఫ్ట్ బటన్ నొక్కగానే తలుపులు తెరుచుకుంటాయి. కానీ, లోపల 'క్యాబిన్' (ఫ్లోర్) ఉందో లేదో చూసుకోకుండా అడుగు వేయకండి. కొన్నిసార్లు సాంకేతిక లోపం వల్ల క్యాబిన్ రాకముందే తలుపులు తెరుచుకోవచ్చు.

  • లిఫ్ట్ సామర్థ్యానికి మించి ఎక్కకూడదు.  ఓవర్‌లోడ్ వల్ల బ్రేకులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది.

  • ముఖ్యంగా చిన్న పిల్లలతో లిఫ్ట్‌ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా లిఫ్ట్ ఎక్కనివ్వకండి. చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లండి. లిఫ్ట్ లోపల బటన్లతో ఆడుకోకుండా చూడండి.

  • కదులుతున్న లిఫ్ట్ తలుపులకు ఆనుకుని నిలబడాలి.. అలాగే తలుపులు మూసుకుంటున్నప్పుడు చేతులు లేదా కాళ్లు అడ్డు పెట్టకండి. ఎందుకంటే ఒక్కోసారి సెన్సార్లు పని చేయకపోతే ప్రమాదం జరగొచ్చు. 

  • లిఫ్ట్ లోపల గెంతడం లేదా అల్లరి చేయడం వల్ల లిఫ్ట్ 'సేఫ్టీ గ్రిప్స్' లాక్ అయిపోయి మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది.

  • చీర కొంగులు, పొడవైన దుస్తులు లేదా బ్యాగ్ బెల్టులు తలుపుల మధ్య చిక్కుకోకుండా చూసుకోండి.

  • ఒక వేళ లిఫ్ట్‌ మధ్య ఆగిపోతే ఆందోళనపడవద్దు. లిఫ్ట్ ఆగిపోగానే ఊపిరి ఆడదనే భయం అస్సలు వద్దు.  లిఫ్ట్‌లోని 'Alarm' లేదా 'Call' బటన్‌ను నొక్కాలి.

  • ప్రశాంతంగా ఉంటూ ఫోన్‌ ద్వారా మెయింటెనెన్స్ టీమ్‌కు, లేదా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి.  టెక్నీషియన్లు వచ్చే వరకు లోపలే సురక్షితంగా ఉండటం ఉత్తమం.

  • అలాగే లిఫ్ట్ ఫ్లోర్ల మధ్యలో ఆగినప్పుడు, తలుపులు బలవంతంగా తెరిచి బయటకు దూకడానికి ప్రయత్నించకండి. లిఫ్ట్ ఒక్కసారిగా కదిలితే ప్రాణాపాయం కలగవచ్చు.

  • అపార్ట్‌మెంట్‌ కమిటీలు అసోసియేషన్లు కనీసం నెలకు ఒకసారి గుర్తింపు పొందిన టెక్నీషియన్లతో లిఫ్ట్ కండిషన్‌ను చెక్ చేయించాలి.లిఫ్ట్ లోపల కెమెరా, ఎమర్జెన్సీ లైట్లు పని చేస్తున్నాయో లేదో చూసుకోవాలి.

  • లిఫ్ట్‌కు తప్పనిసరిగా Automatic Rescue Device (ARD) సిస్టమ్ ఉండాలి. ఇది కరెంట్ పోయినప్పుడు లిఫ్ట్‌ను దగ్గరలోని ఫ్లోర్‌లో ఆగేలా చేస్తుంది.

  • ఒకవేళ భవనంలో మంటలు (Fire) చెలరేగినప్పుడు లేదా భూకంపం వచ్చినప్పుడు పొరపాటున కూడా లిఫ్ట్ వాడకూడదు. మెట్లు మాత్రమే ఉపయోగించాలి అనేది గుర్తుంచుకోవాలి. 
     

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)