Breaking News

విద్యార్థుల సాక్షిగా భార్యకు తీన్‌ తలాక్‌!

Published on Tue, 08/29/2023 - 09:36

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో తీన్‌ తలాక్‌కు సంబంధించిన విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. టీచర్‌గా పనిచేస్తున్న తన భార్యకు స్కూలులోనే అతని భర్త తీన్‌ తలాక్‌ చెప్పాడు. విద్యార్థులందరి ముందు ఈ చర్యకు పాల్పడిన అతను ఆ తరువాత అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ ఘటన అనంతరం బాధిత మహిళ తన భర్తతోపాటు మరో నలుగురిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ తాను పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా తన భర్త తనకు తీన్‌ తలాక్‌ చెప్పాడని తెలిపింది.  తరువాత మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని పేర్కొంది. కాగా ఈ ఘటన బారాబంకి పరిధిలోని బేగమ్‌గంజ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం బాధితురాలు తమన్నాకు 2020లో ఫిరోజాబాద్‌ జిల్లాలోని కరీమ్‌గంజ్‌కు చెందిన షకీల్‌తో వివాహం అయ్యింది. అయితే ఆ సమయంలో కట్నం రూపంలో రెండు లక్షలు కావాలని షకీల్‌ డిమాండ్‌ చేశాడు. అంతమొత్తం ఆమె కుటుంబసభ్యులు ఇచ్చుకోలేకపోవడంతో ఆమెను షకీల్‌ ఇంటి నుంచి గెంటివేశాడు. దీంతో తమన్నా పుట్టింటికి చేరుకుంది.   

కొంతకాలం తరువాత షకీల్‌ భార్యకు చెప్పకుండా సౌదీ అరబ్‌ వెళ్లిపోయాడు. ఈ విషయం తెలియగానే తమన్నా అత్తవారింటికి వెళ్లింది. అయితే అత్తింటి వారు ఆమెను ఇంటిలోనికి వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆమె తిరిగి పుట్టింటికి చేరుకుంది. అప్పటి నుంచి ఆమె ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ వస్తోంది. ఇంతలో సౌదీ అరబ్‌ నుంచి తిరిగి వచ్చిన షకీల్‌ భార్యకు ఫోన్‌ చేసి విడాకులు ఇస్తానని బెదిరించాడు. తరువాత ఆగస్టు 24న ఆమె పనిచేస్తున్న స్కూలుకు వచ్చి, ఆమెకు తీన్‌ తలాక్‌ చెప్పాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు షకీల్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: 3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి.. ఖజానా లెక్కలకు 10 ఏళ్లు!

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)