Breaking News

ఖతర్నాక్‌ విగ్గురాజా

Published on Tue, 01/06/2026 - 21:19

బట్టతల కారణంగా పెళ్లి ఈడు దాటిపోతుండడంతో.. అతగాడు ఘరానా మోసానికి దిగాడు. విగ్గుతో మేనేజ్‌ చేస్తూ ఎలాగోలా ఓ అమ్మాయికి తాళిబొట్టు కట్టేశాడు. తీరా.. కాపురంలోకి అడుగుపెట్టాక అతగాడి హెయిర్‌స్టైల్‌పై అనుమానం వచ్చిందామెకు. కొన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చిన అతను.. చివరకు అడ్డంగా దొరికిపోయాడు. అక్కడి నుంచే అసలు డ్రామా మొదలుపెట్టాడు.. 

బట్టతల భర్త పెట్టే టార్చర్‌ తట్టుకోలేక ఓ భార్య నోయిడా పోలీసులను ఆశ్రయించింది. విగ్గు పెట్టుకుని తనను పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత జుట్టు రాలుతోందంటూ డ్రామాలు ఆడాడనని.. చివరకు విషయం తెలిసిపోవడంతో విగ్గు పీకేసి విలన్‌ వేషాలు వేస్తున్నాడని వాపోయిందామె. అప్పటి నుంచి సైకోలా మారిపోయి వేధించడం మొదలుపెట్టాడు.. 

నా ఫోన్‌ నుంచి వ్యక్తిగత ఫొటోలు సేకరించి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేశాడు. చేసేది లేక నగలు ఇచ్చేశాను. ఆపై అదనపు కట్నం కోసం నా తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు. భరించలేక న్యూఢిల్లీ ప్రతాప్‌ భాగ్‌లోని అత్తింటి నివాసంలో పంచాయితీ పెట్టించా. అందరి ముందు విగ్గు తీసేసి.. ఏం చేస్తావో చేసుకో అంటూ తన కుటుంబ సభ్యులతో కలిసి మమ్మల్ని వేధించాడు అని ఫిర్యాదులో పేర్కొందామె. 

సదరు భర్త కుటుంబం మొత్తంపై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయని.. పరారీలో ఉన్న భర్త కుటుంబం కోసం గాలిస్తున్నట్లు బిస్రాఖ్‌ పీఎస్‌ అధికారి మనోజ్‌కుమార్‌ చెబుతున్నారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)