Breaking News

పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్‌

Published on Mon, 06/08/2026 - 12:07

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో  జరిగిన ఒక వింత పెళ్లి నెట్టింట  హల్‌ చల్‌ చేస్తోంది. ఒక వ్యక్తి ఏకంగా పిల్లనిచ్చిన సొంత అత్తనే వివాహం చేసుకున్న ఘటన  పలువుర్ని విభ్రాంతికి గురి చేసింది.   ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

సోషల్ మీడియాలో  వైరల్‌ అవుతున్న సమాచారం ప్రకారం, అక్బర్‌పూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో, సదరు వ్యక్తి తన భార్యను వదిలిపెట్టి, ఆమె తల్లిని కోర్టు వివాహం చేసుకున్నారట.   అంతేకాదు తమ వివాహ ధృవీకరణ పత్రాన్ని చేతిలో పట్టుకుని, తమ బంధాన్ని అంగీకరించాలని , తమ నిర్ణయాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ జంటకు వివాహానికి సంబంధించిన  వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో,  నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కుమార్తె వివాహం జరిగిన తర్వాత అత్తా-అల్లుళ్ల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని సమాచారం. అయితే ఆ వ్యక్తి భార్య స్పందన ఏంటి అనేదానిపై స్పష్టతలేదు.  

ఇదీ చదవండి: నర్సింగ్‌ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు

ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకుఎటువంటి పోలీసు ఫిర్యాదు నమోదు కాలేదు. అలాగే అధికారులు ఎటువంటి చట్టపరమైన చర్యల గురించి వెల్లడించలేదు.  

నెటిజన్ల మాత్రం ఈ వివాహం గురించి తెలిసి బంధాలు, నైతిక విలువలు మంటగలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేయగా, వావి వరుసలు మర్చిపోతున్నారంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక వివాదాస్పద ప్రేమకథ మాత్రమే కాదు, ఒక కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేసిన పరిస్థితి.  మధ్యలో నలిగిపోయే వారే అసలైన బాధితులు, కుటుంబ అనుబంధం హద్దులు దాటింది. కామమే గెలిచింది, కుటుంబం ఓడిపోయిందని  మరొకరన్నారు. సొంత రక్తమే వినాశనానికి కారణమైతే, ఇక ఎవరిని నమ్మాలి?" పాపం..ఆమె కుమార్తె పరిస్థితి ఏంటి అని ఆరాతీస్తున్నారు. 

కాగా 2024లో బీహార్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఈ ఘటనలో భార్య మరణం తరువాత, అతను అత్తమామల ఇంట్లోనే నివసించడం ప్రారంభించాడు. ఆ క్రమంలో అతను తన 55 ఏళ్ల అత్తగారు గీతా దేవితో సన్నిహితమయ్యాడు. ఒక రోజు, అతను గీతతో ఏకాంతంగా ఉండగా అతని మామగారు వారిని రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత, ఆ వ్యక్తి గ్రామస్తులందరి సమక్షంలో గీతను ప్రేమిస్తున్నట్లు అంగీకరించి, ఆమెను వివాహం చేసుకున్నాడు.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)