Breaking News

నిరసనలు కేంద్రం కుట్ర: మమత

Published on Tue, 09/10/2024 - 05:11

కోల్‌కతా: వైద్యురాలి హత్యాచారంపై నిరసనల వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందని పశి్చమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. వామపక్షాలూ ఈ కుట్రలో భాగమయ్యాయన్నారు. సచివాలయం నబన్నాలో సోమవారం ఒక అధికారిక సమీక్షలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్‌.జి.కర్‌ ఆసుపత్రిలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్‌ రేప్, హత్య ఉదంతంలో నెలరోజులుగా బెంగాల్‌లో ప్రజలు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

 బాధితురాలి తల్లిదండ్రులకు తానెప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదని మమత అన్నారు. ఈమేరకు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. దుర్గాపూజ సమీపిస్తున్నందున నిరసనలు వీడి.. పండుగ ఏర్పాట్లు చేపట్టాలని ప్రజలను కోరారు. ‘వైద్యురాలి కుటుంబానికి నేనెప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదు. అభాండాలు వేస్తున్నారు. కూతురి జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం  చేపట్టదలిస్తే మా ప్రభుత్వం అండగా ఉంటుందని తల్లిదండ్రులకు చెప్పాను. 

ఎప్పుడేం మాట్లాడాలో నాకు తెలుసు. నిరసనలు ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కుట్రే. కొన్ని వామపక్ష పార్టీలకు ఇందులో భాగస్వామ్యముంది. పొరుగుదేశంలో అస్థిరత చూసి.. ఇక్కడా అలాంటి ఆందోళనలు రేకెత్తించాలని కొందరు చూస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్‌లు రెండు వేర్వేరు దేశాలని వారు మర్చిపోయారు’ అని మమత ధ్వజమెత్తారు. ఆందోళన నేపథ్యంలో కోల్‌కతా పోలీసు కమిషనర్‌ వినీత్‌ గోయల్‌ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని, దుర్గాపూజ వేళ శాంతి భద్రతలపై పట్టున్న అధికారి అవసరం ఉందని దాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా విధుల్లో చేరాలని జూనియర్‌ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు.  

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)