Breaking News

ఐదు గంటల హడావుడి: ఖర్గే 

Published on Sun, 09/14/2025 - 05:59

న్యూఢిల్లీ: మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటనపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం ఐదు గంటలు కూడా ఆయన మణిపూర్‌ ప్రజలతో గడపలేకపోయారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వర్గవైషమ్యాలతో రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న వారిని ఈ పర్యటనతో మోదీ ఘోరంగా అవమానించారన్నారు. మోదీ పర్యటనను ఆయన పిట్‌ స్టాప్‌గా అభివరి్ణంచారు. ‘రెండేళ్లకుపైగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో సుమారు 300 మంది చనిపోగా, 1,500 మంది గాయపడ్డారు. మరో 67 వేల మంది నిరాశ్రయులయ్యారు. 

ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు అటువైపు కన్నెత్తి కూడా చూడని ప్రధాని మోదీ ఇప్పుడు హడావుడిగా ఇంఫాల్‌ నుంచి చురాచాంద్‌పూర్‌ వరకు రోడ్‌ షో చేపట్టడమేంటి?’అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సహాయ శిబిరాల్లోని ప్రజల మొర ఆలకించకుండా పిరికితనంతో తప్పించుకోవడానికే మోదీ షో చేపట్టారని ఎక్స్‌లో ఖర్గే వ్యాఖ్యానించారు. పర్యటనకు వెళ్లిన మోదీ ఘనమైన స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేయించుకోవడం బాధితుల గాయాలను మరింతగా పెంచడమేనన్నారు. ఇలాంటి చర్యలతో మోదీలో పశ్చాత్తాపం గానీ, అపరాధ భావన కానీ లేవని వెల్లడవుతోందన్నారు. మణిపూర్‌లో అశాంతి కొనసాగుతున్న గత 864 రోజుల సమయంలో 46 విదేశీ పర్యటనలు చేసిన మోదీకి, మన పౌరులతో రెండు సానుభూతి మాటలు పంచుకునే తీరికే దొరకలేదా అని ప్రశ్నించారు.

 మణిపూర్‌ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా అసమర్థత బయటపడిందన్నారు. దీన్నుంచి తప్పించుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారని ఖర్గే ఆరోపించారు. మీ రాజ్యధర్మం ఎక్కడికి పోయిందంటూ 2002లో మాజీ ప్రధాని అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి అప్పట్లో గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖర్గే ప్రస్తావించారు. ఇలా ఉండగా, 28 నెలలుగా ఎదురుచూస్తున్న మణిపూర్‌ ప్రజలతో ప్రధాని మోదీ కనీసం ఐదు గంటలైనా గడపలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. ప్రచారానికి, విదేశాల్లో పర్యటనలకు ఉన్న సమయం ప్రజల మధ్య గడిపేందుకు ఆయనకు దొరకలేదా అని నిలదీశారు.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)