Breaking News

మోదీ.. పాత కేసులతో వేధించే ప్రయత్నం: ఖర్గే ఆగ్రహం

Published on Tue, 12/02/2025 - 13:42

ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్​ కేసులో కొత్త ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడంపై ఖర్గే పలు విమర్శలు చేశారు. ఇది బీజేపీ, మోదీ రాజకీయ ప్రతీకారం అని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం, ఈడీ కలిసి కొత్త ఆరోపణలు లేక ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని పాత కేసులను తిరిగి తెరపైకి తీసుకువస్తున్నాయని అన్నారు.

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విషయమై మల్లికార్జున ఖర్గే ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘12 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా గాంధీ కుటుంబంపై కొత్త ఎఫ్​ఐఆర్ నమోదైంది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం, ఈడీ వద్ద కొత్త ఆరోపణలు లేవు. వాస్తవాలు తక్కువగా ఉన్నప్పుడు నాటకీయ అంశాలు రంగంలోకి దిగాయి. రాజకీయ ప్రతీకార చర్య, పాత ఆరోపణలు తీసుకురావడం అన్నీ ప్రత్యర్థులను వేధించే ప్రయత్నం. ఇది రాజకీయ ప్రతీకార చర్య. దీనిని న్యాయవ్యవస్థ కచ్చితంగా గుర్తిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’ అని పోస్టులో పేర్కొన్నారు.

కేసు వివరాలు ఇలా.. 
దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1938లో వార్తాపత్రిక నేషనల్ హెరాల్డ్‌ స్థాపించారు. ఈ పత్రికలో అవకతవకలు జరిగాయంటూ 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) సంస్థలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఏజెఎల్​ సంస్థకు చెందిన రూ.2000 విలువైన స్థలాలను కేవలం రూ.50 లక్షలకే దక్కించుకున్నట్లు అభిమోగాలు మోపింది. వాటిలో రాహుల్‌కు 38శాతం, సోనియాకు 38శాతం షేర్లు ఉన్నాయి. ఏజేఎల్‌కు చెందిన 99 శాతం షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు బదిలీ చేశారు. ఈ లావాదేవీ మనీలాండరింగ్‌లో భాగమన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ 2021 నుంచి అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది.

ఇదిలా ఉండగా.. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని డిసెంబర్​ 16కు వాయిదా వేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్‌ జర్నలిస్ట్స్‌ లిమిటెడ్‌(AJL)కు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో కాంగ్రెస్‌ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్, సుమన్‌ దూబే, శ్యామ్‌ పిట్రోడాలతోపాటు యంగ్‌ ఇండియన్‌ అనే ఒక ప్రైవేటు కంపెనీ కుట్రకు, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)