Breaking News

రైలు ఏసీ కోచ్‌లో మ్యాగీ : వీడియో వైరల్‌, నెటిజన్లు ఫైర్‌

Published on Fri, 11/21/2025 - 12:59

కుటుంబాలతో కలిసి రైల్లో ప్రయాణించేటపుడు  ఎక్కువ ఫుడ్‌ను ఆస్వాదిస్తాం. పులిహోర, దద్జోజనం, పూరీలు చికెన్‌, స్వీట్‌ పూరీలు, చపాతీలు,  బిర్యానీ , టీ-కాఫీ వరకు  రకరకాలుగా   ముందే ప్రిపేర్‌ చేసుకుని వెళ్లి, రైలు బోగీలో తింటూ ఉండే అదో ఆనందం. ముఖ్యంగా పిల్లలు ఇలాంటి జర్నీలను బాగా ఎంజాయ్‌ చేస్తారు. మారు మాట్లాడకుండా, మారం చేయకుండా చక్కగా తింటారు. 

మరో విధంగా చెప్పాలంటే ఇదొక మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది.  అయితే మరికొంతమంది వేడి వేడిగా తినడానికి ఇష్టపడతారు.  అయితే రైల్వే   క్యాంటీన్‌లో ఆర్డర్‌ చేసకుంటాం. లేదంటే రైలు ఆగినపుడు ఆయా స్టేషన్లలో కొనుక్కుంటాం. కానీ మహారాష్ట్ర మహిళ చేసిన పని గురించి తెలుసుకుంటే  అవాక్కవుతారు. పదండి ఆ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.

ఇదీ చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్‌ కూడా!

మహారాష్ట్రకు చెందిన ఒక  మహిళ  ఏకంగా ఏసీ రైలు బోగీలోనే మ్యాగీ తయారు చేసింది. రైలు ఏసీ కంపార్ట్‌మెంట్‌లోని చార్జింగ్ సాకెట్‌లో ఎలక్ట్రిక్ కెటిల్ పెట్టి కెటిల్‌లో ఇన్‌స్టంట్ నూడుల్స్ ప్రిపేర్‌ చేసింది పైగా కెమెరాకు చక్కగాఫోటోలకు పోజులిచ్చింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. రైలులో మ్యాగీ వేడిగా వడ్డిస్తే  తినడం  బాగానే ఉంటుంది, కానీ సేఫ్టీ పరిస్థితి ఏంటి అంటూ  నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు  మినిమం సెన్స్‌ లేదు, ఇలా చేస్తే చాలా ప్రమాదకరం కదా అని కమెంట్‌ చేశారు. రైలులోని ఎలక్ట్రికల్ సర్క్యూట్‌పై అదనపు భారం పడి మంటలు చెలరేగే ప్రమాదం ఉందని మరికొందరు హెచ్చరించారు.   

"చాలా ఏళ్ల క్రితం, చెన్నై నుండి టాటానగర్‌కు రైలులో వెళుతుండగా,  ఒక కుటుంబం పూజ చేసి అగర్‌ బత్తి, కర్పూరం వెలిగించింది. నేను వెంటనే టీసీకి ఫిర్యాదు  చేశాను  ఈ రోజుల్లో జనానికి  బుద్ధి లేదు.  ఇలాంటి పిచ్చి పనులు మానడం లేదు.’’ అంటూ గతంలో తనకు ఎదురైన అనభవాన్ని షేర్‌ చేశారొకరు. డబ్బులు పెట్టి  టికెట్‌ కొనుక్కున్నంత మాత్రాని, మొత్తం ప్రయాణికుల ప్రాణాల్ని ఫణంగా పెట్టే పనులు చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)