Breaking News

వెండి కంచాల్లో విందు.. వివాదంలో బీజేపీ సర్కార్‌

Published on Thu, 06/26/2025 - 08:26

ముంబై: మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వంపై కొత్త వివాదం నెలకొంది. ప్రభుత్వం వృథా ఖర్చులపై కాంగ్రెస్‌ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ కార్యక్రమంలో అతిథులకు భారీ ఖర్చుతో వెండి పళ్లెంలో ఆహారం వడ్డించడం వివాదాస్పదంగా మారింది. అంత ఖర్చు చేసి వెండి ప్లేట్లలో వడ్డించాల్సిన అవసరమేంటని హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబై వేదికగా పార్లమెంట్ అంచనాల కమిటీ ప్లాటినం జూబ్లీ సమావేశం జరిగింది. ముంబైలోని విధాన్ భవన్ కాంప్లెక్స్‌లో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా దాదాపు 600 మంది అతిథులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అతిథులకు విలాసవంతమైన హోటల్‌లో వెండి ప్లేట్లలో, భారీ ఖర్చుతో భోజనం వడ్డించారు. దీంతో, ఈ ఘటన వివాదానికి దారి తీసింది. అతిథులు ఒక్కొక్కరికి రూ.550 చొప్పున అద్దెకు తీసుకున్న వెండి డిన్నర్ ప్లేట్లపై రూ.5,000 విలువైన భోజనం వడ్డించారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది.

ఈ సందర్బంగా కాంగ్రెస్‌ శాసనసభా నాయకుడు విజయ్ వాడేట్టివార్స్ స్పందిస్తూ..‘రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో ఇంత ఖర్చు చేసి వెండి ప్లేట్లపై అతిథులకు వడ్డించడం ఎందుకు?. విలాసవంతమైన విందు ఎందుకు ఇచ్చారు. దీని కోసం దాదాపు 27 లక్షలు ఖర్చు చేశారు. ఇదంతా వృథా ఖర్చే కదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయలేదు. బోనస్‌లు చెల్లించడం లేదు. అనేక సంక్షేమ పథకాల్లో కోతలు విధించారు. కానీ, ఇలాంటి ఖర్చులు చేయడానికి మాత్రం బీజేపీ ‍ప్రభుత్వం వెనుకాడదు అంటూ చురకలు అంటించారు.

మరోవైపు.. ఈ సమావేశంపై సామాజిక కార్యకర్త కుంభార్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన..‘రాజ పేష్వా శైలి వైభవంతో వెండి ప్లేట్లతో అతిథులకు భోజనం వడ్డించారు. తాజ్, ట్రైడెంట్ వంటి లగ్జరీ హోటళ్లలో అంచనాల కమిటీ సభ్యులు బస చేశారు. అంచనాల కమిటీ అంటే ప్రతీ రూపాయిని ప్రజా సంక్షేమం​ కోసం ఖర్చు చేయడం కోసం ఆలోచించాలి. కానీ, ఇలాంటి దుబారా ఖర్చులు చేయడమేంటి?. ఇలాంటి వారు.. ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తారా? అని ప్రశ్నించారు. 5000 ఖర్చు చేసే భోజనం పెట్టి వెండి ప్లేట్ల కోసం 27 లక్షలు ఖర్చు చేశారు’ అని మండిపడ్డారు.

అయితే, కాంగ్రెస్‌ నేతలు, పలువురు ఆరోపిస్తున్నట్టు అవి వెండి ప్లేట్లు కాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేవలం వెండి పూత మాత్రమే ప్లేట్లకు పూసి ఉందని అంటున్నారు. అలాగే, భోజనం ఖర్చు కూడా 5000 కాదని తక్కువగా ఉందని వ్యాఖ్యలు చేశారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)