Breaking News

కాంగ్రెస్, ఏంఐఏంతో.. బీజేపీ పొత్తు..!

Published on Wed, 01/07/2026 - 16:32

ముంబై: మహరాష్ట్రలో ఇటీవల  మున్సిపల్   ఛైర్‌పర్సన్ స్థానం కోసం బద్ధ శత్రువులైన కాంగ్రెస్-బీజేపీ పార్టీలు జతకట్టాయి. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. అయితే తాజాగా ఆ పొత్తుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఇటువంటి పొత్తులను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదని హెచ్చరించారు.

మహారాష్ట్రలోని కళ్యాణ్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అంబర్‌పేట్ మున్సిపల్ కౌన్సిల్‌కు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 31 స్థానాలు దీనిలో షిండే నేతృత్వంలోనే శివసేనకు 27 స్థానాలు రాగా, బీజేపీ14, కాంగ్రెస్ 12, ఎన్సీపీకి నాలుగు స్థానాలు వచ్చాయి. దీంతో మున్సిపల్ పీఠం కోసం బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీలు జతకట్టాయి. దీంతో ఉప్పు, నిప్పులా ఉండే కాంగ్రెస్, బీజేపీలు జతకట్టడం దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాయి. 

అంతేకాకుండా అకోలా జిల్లాలోని అకోట్ మున్సిపల్ స్థానం కోసం సైతం బీజేపీ పార్టీ తన బద్దశత్రువైన ఏంఐఏంతో పొత్తుపెట్టుకుంది. ఈ నేపథ్యంలో  అనైతిక కలయికపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ "కాంగ్రెస్, ఎంఐఏం పార్టీలతో పొత్తును ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఎవరైనా గ్రామ స్థాయి నాయకులు ఇలా పొత్తు పెట్టుకుంటే వారిపై చర్యలు తీసుకోబడతాయి" అన్నారు. ఇటువంటి పొత్తులను పార్టీ అధిష్ఠానం ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించదని హెచ్చరించారు. 

పొత్తుల వ్యవహారంపై ఇదివరకే నాయకులకు ఆదేశాలు జారీ చేశాం అన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్ స్పందించారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ పొత్తు కాదని శివసేన( శిండే) అవినీతిని పారద్రోలడానికి అన్ని పార్టీలు ఏకమయ్యాయన్నారు. దీనిని బీజేపీ, కాంగ్రెస్ పొత్తుగా పోల్చడం సరికాదన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)