Breaking News

కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు

Published on Tue, 01/28/2025 - 11:26

ఝాన్సీ : మహాకుంభమేళాకు వెళుతున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. మధ్యప్రదేశ్‌లోని హర్పాల్‌పూర్‌లో ఝాన్సీ నుండి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న రైలుపై  అల్లరిమూకలు రాళ్లు రువ్వారు. ఈ రైలు మహా కుంభమేళాకు వెళుతోంది.

ఝాన్సీ డివిజన్‌లోని హర్పాల్‌పూర్ స్టేషన్‌లో సోమవారం రాత్రి  ఒంటిగంట ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అకస్మాత్తుగా రైలుపై దాడి జరిగిన నేపధ్యంలో రైలులోని  ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అల్లరిమూకలు రైలులోనికి ప్రవేశించే ‍ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాకపోవడంతో రాళ్లతో కిటికీలను పగులగొట్టారని ‍ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారని సమాచారం.

విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక పోలీసులతో పాటు రైల్వే రక్షణ దళం పరిస్థితిని అదుపులోనికి తెచ్చింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఛతర్‌పూర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ వాల్మిక్ చౌబే మాట్లాడుతూ ఛతర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో గేటు తెరవకపోవడంతో తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో కొందరు అల్లరిమూకలు రైలుపై రాళ్లు రువ్వారని తెలిపారు. ఈ రైలు ఛతర్‌పూర్ నుండి ప్రయాగ్‌రాజ్  వెళుతోందని, దాడికి పాల్పడినవారంతా పరారయ్యారని తెలిపారు.

ప్రయాగరాజ్ వెళ్తున్న ట్రైన్‌పై మధ్యప్రదేశ్లో రాళ్ల దాడి



ఇది కూడా చదవండి: Baghpat Incident: లడ్డూ పండుగలో విషాదం.. ఏడుగురు మృతి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)