మహాకుంభమేళాలో మాయమైన మహిళ తిరిగొచ్చిందిలా..

Published on Sat, 03/15/2025 - 08:48

పట్నా: సోషల్‌ మీడియాతో కొంతమేరకు ముప్పు  పొంచివున్నమాట వాస్తవమే అయినప్పటికీ, ప్రయోజనాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. సోషల్‌ మీడియాను సరైన రీతిలో వినియోగించుకుంటే  ఎన్నో సమస్యలకు పరిష్కారం లభింస్తుందనడంలో సందేహం లేదు. బీహార్‌లోని రోహతక్‌ జిల్లాలోని బల్దారీ గ్రామానికి చెందిన లాఖ్‌పాతో దేవి విషయంలో సోషల్‌ మీడియా ఒక వరంలా మారింది.

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)కు వెళ్లిన లాఖ్‌పతో దేవి అక్కడ తప్పిపోయింది. ఇప్పుడు సోషల్‌ మీడియా సాయంతో ఇంటికి చేరుకుంది. ఆమె ఫిబ్రవరి 24న తన కుటుంబ సభ్యులతో పాటు మహాకుంభ్‌లో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లింది. అయితే అక్కడ జనసమూహం అధికంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు కుంభమేళా ‍ప్రాంతంలోనే రెండు రోజుల పాలు ఉండి, ఆమె కోసం వెదికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఇంటికి తిరుగుముఖం పట్టారు.

అయితే ఇది జరిగిన 15 రోజుల తరువాత లాఖ్‌పాతో దేవి జార్ఖండ్‌(Jharkhand)లోని గఢ్వా జిల్లాకు చెందిన బహియాపూర్‌లో ఉందని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. బహియాపూర్‌ పంచాయతీ సభ్యురాలు సోనీదేవి భర్త వీరేంద్ర మీడియాతో మాట్లాడుతూ ఇటీవల 60 ఏళ్ల మహిళ తమ ఇంటికి వచ్చిందని, ఆ సమయంలో ఆమె బలహీనంగా కనిపించిందన్నారు. దీంతో ఆమెకు ఆహారం అందించి, వసతి కల్పించామన్నారు. ఆమె తన చిరునామా చెప్పలేకపోవడంతో ఆమె ఫొటోను సోషల్‌ మీడియాలో సంబంధిత వివరాలతో పాటు షేర్‌ చేశామని తెలిపారు.

లాఖ్‌పాతో దేవి కుమారుడు రాహుల్‌ తల్లి ఫొటోను చూసి, వెంటనే జార్ఖండ్‌ చేరుకుని తన తల్లిని తనతోపాటు ఇంటికి తీసుకువచ్చాడు. ఈ సందర్బంగా రాహుల్‌ మాట్లాడుతూ మార్చి 10 సోషల్‌ మీడియాలో తన తల్లి ఫొటోను చూశానని,తరువాత తాను బహియార్‌ పూర్‌ చేరుకుని తన తల్లిని కలుసుకున్నానని తెలిపారు. 

ఇది కూడా చదవండి: తండ్రి ఫోన్‌ రిపేర్‌ చేయించలేదని.. కుమారుడు ఆత్మహత్య

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)