Breaking News

దసరాకి సోనమ్ దిష్టిబొమ్మ దహనం.. హైకోర్టు అభ్యంతరం

Published on Sun, 09/28/2025 - 11:54

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రాజా రఘువంశీ హత్య కేసులో అరెస్టయిన  అతని భార్య సోనమ్ రఘువంశీ(24) మళ్లీ వార్తల్లో నిలిచారు. మేఘాలయలో హనీమూన్ సందర్భంగా  భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశీ దిష్టిబొమ్మను దసరా రోజున దహనం చేయకుండా చూడాలని మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సోనమ్ రఘువంశీ తల్లి దసరా రోజున తన కుమార్తె దిష్టిబొమ్మను దహనం చేయకుండా చూడాలని, ఈ తరహా బహిరంగ అవమానకర చర్యలకు ఎవరూ పాల్పడకుండా ఆపాలని  కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. పిటిషనర్ తన కుటుంబంపై చట్టవిరుద్ధమైన లేదా రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు జరగకుండా చూడాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ప్రణయ్ వర్మ  మాట్లాడుతూ.. పిటిషనర్ దాఖలు చేసిన అభ్యర్థన చూస్తుంటే.. విజయదశమి నాడు రావణుని దిష్టిబొమ్మకు బదులుగా పిటిషనర్ కుమార్తె దిష్టిబొమ్మను దహనం చేయాలని ఎవరో ప్రతిపాదించినట్లు స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. అయితే అది సరికాదని, అలా చేయడం భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో పూర్తిగా ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు.

పిటిషనర్ కుమార్తె ఒక క్రిమినల్ కేసులో నిందితురాలిగా ఉన్నప్పటికీ, ఆమె  దిష్టిబొమ్మ దహనానికి అనుమతినివ్వబోము. ఇది ఖచ్చితంగా పిటిషనర్‌తో పాటు ఆమె కుమార్తె,  కుటుంబ సభ్యుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లవుతుందని జస్టిస్ ప్రణయ్ వర్మ అన్నారు. అలాగే రావణుడి దిష్టిబొమ్మ స్థానంలో ఎవరైనా పిటిషనర్ కుమార్తె లేదా మరే ఇతర వ్యక్తి దిష్టిబొమ్మను దహనం చేయకుండా చూసుకోవాలని కోర్టు రాష్ట్ర అధికారులను కోర్టు ఆదేశించింది. ఇటువంటి చర్యలు చట్ట నియమాలకు విరుద్ధమని, ఇది పిటిషనర్  కుటుంబపు ప్రతిష్టను శాశ్వతంగా దెబ్బతీస్తుందని కోర్టు పేర్కొంది. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)