Breaking News

ఆర్మీపై మధ్యప్రదేశ్‌ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Fri, 05/16/2025 - 19:10

జబల్పూర్‌: యావత్‌ భారతదేశం, ఆర్మీ ప్రధాని నరేంద్ర మోదీ పాదాల ముందు మోకరిల్లాయంటూ మధ్యప్రదేశ్‌ డిప్యూటీ సీఎం జగదీశ్‌ దేవ్‌డా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని మోదీకి మనం కృతజ్ఞతలు చెప్పాలి. మొత్తం దేశంతో పాటు మన సైన్యం ఆయన పాదాలకు నమస్కరిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం జబల్పూర్‌లో జరిగిన సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ శిక్షణా కార్యక్రమంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన.

జగదీశ్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది.  డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు సిగ్గు చేటు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపునిచ్చింది. సైనికాధికారిణి కల్నల్‌ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ ఆ రాష్ట్ర మంత్రి విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగిన సంగతి తెలిసిందే.

విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతగల పదవుల్లో ఉండి దేశానికి రక్షణ కల్పిస్తున్న మహిళా అధికారుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, మరోసారి వివాదంలో బీజేపీ నేత చిక్కుకోవడంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. తన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ వక్రీకరించిందని జగదీష్‌ దేవ్‌డా మండిపడ్డారు.

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)